CSK vs RCB : పోరాడి గెలిచిన ఆర్సీబీ.. కీలక మ్యాచ్ లో చెన్నై ఓటమి.. ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు
RCB vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 68వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన ఆర్సీబీ.. సీఎస్కేను 27 పరుగుల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది.
Royal Challengers Bengaluru vs Chennai Super Kings : అద్భుతంగా ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపుతూ చెన్నై ని చిత్తుగా ఓడించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 27 పరుగుల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. వరుసగా ఆరో విజయంతో ఆర్సీబీ టాప్-4 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 68వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన సీఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది.
బ్యాటింగ్ తో చెన్నై బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్న ఆర్సీబీ..
ఈ మ్యాచ్ తో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాజెంజర్స్ బెంగళూరు టీమ్ అద్భుతమైన బ్యాటింగ్ తో విరాట్ కోహ్లీ-ఫాఫ్ డుప్లెసిస్ శుభారంభం చేశారు. విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. కెప్టెన్ డుప్లెసిస్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మంచి ఫామ్ లో ఉన్న డుప్లెసిస్ అనూహ్యంగా బౌలర్ సైడ్ లో వికెట్లకు బాల్ తగిలి రనౌట్ గా వెనుతిరిగాడు. యంగ్ ప్లేయర్ రజత్ పటిదారు మరోసారి మెరుపులు మెరిపిస్తూ 41 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కామెరాన్ గ్రీన్ 38, దినేష్ కార్తీక్ 14, మ్యాక్స్ వెల్ 16 పరుగులు చేయడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. చెన్నై ముందు 219 పరుగుల టార్గెట్ ను ఉంచింది.
రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. సూపర్ ఫీల్డింగ్..
219 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలి బంతికే క్యాచ్ రూపంలో మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. 3వ ఓవర్ లో డారిల్ మిచెల్ కూడా ఔట్ కావడంతో చెన్నై కష్టాలు పెరిగాయని అనుకుంటున్న సమయంలో రచిన్ రవీంద్ర, అజింక్యా రహానేలు అద్భుతమైన బ్యాటింగ్ తో చెన్నై ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. 61 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే శివం దూబే కూడా పెవిలియన్ బాటపట్టడంతో మ్యాచ్ ఆర్సీబీ వైపు తిరిగింది. కానీ, రవీంద్ర జడేజా-ఎంఎస్ ధోనిలు చివరలో బౌండరీలు బాదడంతో మ్యాచ్ చెన్నై చేతిలోకి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. రవీంద్ర జడేజా 42 పరుగులు, ధోని 25 పరుగులు చేశారు. 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో ఫాఫ్ డుప్లెసిస్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన మ్యాచ్ పట్టాడు. కింగ్ కోహ్లీ సూపర్ ఫీల్డింగ్ మరోసారి ఈ మ్యాచ్ లోనూ చూపించాడు.
ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ విన్నర్ రేసులో విరాట్ కోహ్లీ.. ఇప్పటివరకు విజేతలు వీరే