Asianet News TeluguAsianet News Telugu

కూలిన శిఖరం: వాజ్‌పేయ్ ఇకలేరు

మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ గురువారం నాడు ఎయిమ్స్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా  ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ ఐదేళ్లపాటు ప్రధానమంత్రిగా  వాజ్‌పేయ్ కొనసాగారు. 2014లో భారత ప్రభుత్వం వాజ్‌పేయ్‌కు భారత రత్న ఇచ్చి గౌరవం ఇచ్చింది.

Former Prime Minister and BJP Stalwart Atal Bihari Vajpayee Passes Away Aged 93
Author
New Delhi, First Published Aug 16, 2018, 5:40 PM IST

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ గురువారం నాడు ఎయిమ్స్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా  ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ ఐదేళ్లపాటు ప్రధానమంత్రిగా  వాజ్‌పేయ్ కొనసాగారు. 2014లో భారత ప్రభుత్వం వాజ్‌పేయ్‌కు భారత రత్న ఇచ్చి గౌరవం ఇచ్చింది.

మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం నాడు మరణించారు.  ఈ నెల 12 వ తేదీన వాజ్‌పేయ్‌ను ఆసుపత్రిలో చేర్చారు కుటుంబసభ్యులు. మూత్రపిండాల వ్యాధితో వాజ్‌పేయ్ బాధపడుతున్నారు. ఈ వ్యాధి మరింత తీవ్రమైంది. బుధవారం సాయంత్రానికి  వాజ్‌పేయ్ ఆరోగ్యం మరింత క్షీణించిందని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.

 

ఈ విషయం తెలిసిన వెంటనే బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ ఎయిమ్స్‌లో వాజ్‌పేయ్‌ను పరామర్శించారు. గురువారం నాడు  ఉదయం నుండి ఎయిమ్స్‌లోనే బీజేపీ అగ్రనేతలు ఎయిమ్స్‌లో ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి అద్వానీ వాజ్‌పేయ్ పరిస్థితిని కన్నీరు పెట్టుకొన్నారు.  మరో వైపు గురువారం నాడు దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు  తమ కార్యక్రమాలను రద్దు చేసుకొన్నారు.

 

వాజ్‌పేయ్ ఆరోగ్యం విషమించిందని ఎయిమ్స్ వైద్యులు గురువారం  11 గంటలకు విడుదల చేసిన హెల్త‌్‌ బులెటిన్‌లో ప్రకటించారు. వెంటిలేటర్‌పై వాజ్‌పేయ్ కు చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు.బీజేపీ పాలిత సీఎంలతో పాటు పలు పార్టీల నేతలు ఎయిమ్స్‌లో వాజ్‌పేయ్‌ను పరామర్శించారు. 

ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతూ వాజ్‌పేయ్  గురువారం నాడు  మధ్యాహ్నం కన్నుమూశారు.

 

ఈ వార్తలు చదవండి

హిందూత్వ అతివాదుల్లో మితవాది వాజ్ పేయి

వాజ్ పేయి మంచి హిందీ కవి కూడా....

వాజ్‌పేయ్: బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర, మూడు దఫాలు ప్రధానిగా

వాజ్‌పేయ్: 24 ఏళ్ల తర్వాత ఫోఖ్రాన్ అణు పరీక్షలతో సత్తా

కార్గిల్ యుద్దం: పాక్‌కు చుక్కలు చూపించిన వాజ్‌పేయ్

ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేసిన వాజ్ పేయి (వీడియో చూడండి)

పార్లమెంట్‌పై ఉగ్రదాడి: తృటిలో తప్పించుకొన్న వాజ్‌పేయ్, అద్వానీ

వాజ్ పేయి జీవితంలో అత్యంత చేదు ఘటన ఇదే

అటల్ జీ పెళ్లెందుకు చేసుకోలేదు...?

వాజ్ పేయి అభిమాన నేత ఎవరంటే...

ఒక్క ఓటుతో కుప్పకూలిన వాజ్‌పేయ్ సర్కార్

రేపు సాయంత్రం 5గంటలకు అటల్ జీ అంత్యక్రియలు

 

Follow Us:
Download App:
  • android
  • ios