వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన కార్గిల్ యుద్దం బీజేపీకి 1999లో మరోసారి విజయం సాధించేందుకు అవకాశాన్ని కల్పించింది.ఈ యుద్దంలో పాకిస్తాన్ ఆర్మీని భారత్ సైనికులు  పాకిస్తాన్‌ సరిహద్దు వరకు తరిమారు.

పాకిస్తాన్ సైన్యం  ఆయుధాలు లేకుండా కాశ్మీర్ లోయలోని  చాలా ప్రాంతాల్లోకి అక్రమంగా ప్రవేశించి ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్లాన్ చేసింది.

కార్గిల్ తో పాటు ఇతర ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ వ్యూహత్మకంగా భారత్ లోకి ప్రవేశించే ప్రయత్నాలు చేసింది. ఈ విషయాన్ని గమనించిన భారత్ సైన్యం 1999 జూన్ లో  ఆపరేషన్ విజయ్‌ను ప్రారంభించింది.జూలై 26న పూర్తి చేసింది.

భారత సైన్యం వేలాది మంది మిలిటెంట్లు, పాక్ సైన్యంతో పోరాటం చేశారు. అత్యంత చలిగా ఉండే ఈ ప్రాంతంలో  భారత సైన్యం  శత్రువులను తుదముట్టించారు. మూడు మాసాల కాలంలో సుమారు 500 మంది భారత సైనికులు మరణించారు. 

అదే సమయంలో పాకిస్తాన్ కు చెందిన మిలిటెంట్లు, సైనికులు సుమారు 600 నుండి 4 వేల మంది మరణించారు. పాక్ సైనికులు, మిలిటెంట్లు ఆక్రమించుకొన్న  70 శాంతం ఇండియా భూబాగాన్ని ఆర్మీ తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకొంది.

పాకిస్తాన్ తనంతట తానుగా తిరిగి వెళ్లకపోతే తాము వారిని బయటకు మరో మార్గంలో పంపుతామని అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు వాజ్ పేయ్ రహస్యంగా లేఖ రాశాడనే చెబుతారు. ఎల్ఓసీని దాటి పాక్ బయటకు రావడం పట్ల వాజ్ పేయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అంతేకాదు ఆ సమయంలో ఎల్‌ఓసీని దాటి పాక్‌లో కి ఇండియన్ ఆర్మీ  ప్రవేశించాలని ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో ప్రధానమంత్రిగా ఉన్న వాజ్‌పేయ్ ఈ విషయంలో ఆర్మీని నియంత్రించాడు. పాక్‌‌లో ప్రవేశించకూడదని ఆర్మీని ఆదేశించాడు.

భారత్ కార్గిల్ యుద్దం విషయంలో పాక్ ఏకాకిగా మారింది. చైనా , అమెరికా సహా ఇతర దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచాయి.1999లో జరిగిన ఎన్నికల్లో 504 ఎంపీ సీట్లకు గాను  ఎన్డీఏకు 303 సీట్లు లభించాయి. దీంతో వాజ్ పేయ్ 1999 అక్టోబర్ 13న మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.