వాజ్ పేయి మంచి హిందీ కవి కూడా....

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 16, Aug 2018, 5:48 PM IST
Vajpayee as a Hindi poet
Highlights

మూడు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్ పేయి మంచి కవి కూడా. హిందీ సాహిత్యంలో కవిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజకీయాల్లో తలమునకలవుతూ కూడా ఆయన తన కవిత్వ రచనను వదిలిపెట్టలేదు.

మూడు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్ పేయి మంచి కవి కూడా. హిందీ సాహిత్యంలో కవిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజకీయాల్లో తలమునకలవుతూ కూడా ఆయన తన కవిత్వ రచనను వదిలిపెట్టలేదు. 

ప్రసంగాల్లో చమత్కారాలు ఆయనకు కవిత్వం నుంచి వచ్చినవే. సుపరిపాలన అనే పదం వాడుక ఆయన నుంచి ప్రారంభమైందే. ఆయన పితామహుడు పండిట్ శ్యాంలాల్ వాజ్ పేయి సంస్కృత పండితుడు. అటల్  తండ్రి పండిట్ కృష్ణ బిహారీ కవిగా సుప్రసిద్ధులు. జయంతి ప్రతాప్ అనే పత్రికలో ఆయన కవితలు ప్రచురితమయ్యాయి. 

అటల్ పెద్దన్న పండిట్ అవధ్ బిహారీ వాజ్ పేయి కూడా కవిత్వం రచించేవారు.  ఇంట్లో ఉండే సాహిత్య వాతావరణం ఆయనను కవిత్వంపై వైపు నడిపించింది. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొంటూనే ఆయన రాష్ట్ర ధర్మ మాసపత్రిక, పాంచజన్య వారపత్రికలతో పాటు స్వదేశ్, వీర్ అర్జున్ అనే దిన పత్రికల్లో కూడా పనిచేశారు.  

వాజ్ పేయి రచించిన మొదటి కవిత తాజ్ మహల్. ఈ కవితలో అత్యున్నత శిఖరం చేరుకున్నా సామాన్యుడి నుంచి దూరం కావద్దని కోరుకున్నారు. అలా దూరమైనప్పుడు ఒంటరితనం వేధిస్తుందని చెప్పాడు.

గ్వాలియర్ లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వాజ్ పేయికి తన మాతృభాష హిందీ అంటే ఎనలేని అభిమానం. ఐక్యరాజ్యససమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో మాట్లాడిన తొలి మొదటి వ్యక్తి ఆయనే. 

అత్యవసర పరిస్థితిలో జైలు జీవితం గడుపుతూ ఆయన కవిత్వం రాశారు. ఖైడీ కవిరాజ్ కీ కుందాలే, అమర్ ఆగ్ హై 1994లో అచ్చయ్యాయి. దేశ విభజన సమయంలోని భయానక వాతావరణాన్ని ఆయన తన కవిత్వంలో చిత్రీకరించారు. హార్ నహీ మానుంగా ఆనే ఆయన కవిత ఎంతో ఆదరణ పొందింది.

ఈ వార్తలు చదవండి

కూలిన శిఖరం: వాజ్‌పేయ్ ఇకలేరు

హిందూత్వ అతివాదుల్లో మితవాది వాజ్ పేయి

వాజ్‌పేయ్: బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర, మూడు దఫాలు ప్రధానిగా

వాజ్‌పేయ్: 24 ఏళ్ల తర్వాత ఫోఖ్రాన్ అణు పరీక్షలతో సత్తా

కార్గిల్ యుద్దం: పాక్‌కు చుక్కలు చూపించిన వాజ్‌పేయ్

ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేసిన వాజ్ పేయి (వీడియో చూడండి)

అటల్ జీ పెళ్లెందుకు చేసుకోలేదు...?

పార్లమెంట్‌పై ఉగ్రదాడి: తృటిలో తప్పించుకొన్న వాజ్‌పేయ్, అద్వానీ

వాజ్ పేయి జీవితంలో అత్యంత చేదు ఘటన ఇదే

అటల్ జీ పెళ్లెందుకు చేసుకోలేదు...?

వాజ్ పేయి అభిమాన నేత ఎవరంటే...

ఒక్క ఓటుతో కుప్పకూలిన వాజ్‌పేయ్ సర్కార్

loader