అటల్ జీ పెళ్లెందుకు చేసుకోలేదు...?

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 16, Aug 2018, 6:29 PM IST
Why did Atal Bihari Vajpayee not marry?
Highlights

భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సన్నిహితులు మిత్రులు అటల్ జీని పెళ్లి విషయం గురించి చర్చిస్తే సమయం లేదంటూ ఛలోక్తులు విసిరేవారట.

ఢీల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సన్నిహితులు మిత్రులు అటల్ జీని పెళ్లి విషయం గురించి చర్చిస్తే సమయం లేదంటూ ఛలోక్తులు విసిరేవారట. స్వతహాగా కవి అయినటువంటి అటల్ జీ ఎవరు ఏమడిగినా కవిత్వ రూపంలో చెప్పేసరికి అసలు సమాధానం వచ్చేది కాదట. 

అయితే ఆర్ఎస్ఎస్ సంఘ్ ప్రచారక్ గా పనిచేసిన వాళ్లు పెళ్లి చేసుకోరని...వైవాహిక జీవితానికి దూరంగా ఉంటారని సమాచారం. అలాగే ప్రధాని నరేంద్రమోదీ సైతం ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేసిన తర్వాత తన భార్యకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. సో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేసిన వారు వివాహం చేసుకోరు ఒక వేళ చేసుకున్నా వివాహ బంధానికి దూరమవుతారట.

అలాగే హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తర్ సైతం వివాహం చేసుకోలేదు. మనోహర్ లాల్ కత్తర్ కూడా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేయడంతో వైవాహి బంధానికి దూరమైనట్లు సమాచారం. 
 

loader