ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీజేపీ కార్యవర్గాలు తెలిపాయి. ఎయిమ్స్ నుంచి వాజ్ పేయి నివాసానికి పార్థీవ దేహాన్ని తరలించారు.

ఢిల్లీ: ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీజేపీ కార్యవర్గాలు తెలిపాయి. ఎయిమ్స్ నుంచి వాజ్ పేయి నివాసానికి పార్థీవ దేహాన్ని తరలించారు. రేపు ఉదయం 9 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి అటల్ బిహారీ వాజ్ పేయి పార్థీవ దేహాన్ని తరలిస్తారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సందర్శకులకు అనుమతి ఇస్తారు. సందర్శన అనంతరం మధ్యాహ్నం 1.30 నుంచి అటల్ జీ అంతిమ యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపాయి. సాయంత్రం 5గంటలకు రాజ్ ఘాట్ దగ్గర యమునా నదీతీరంలో రాష్ట్రీయ స్మృతీ స్థల్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.