భార్యపై తండ్రి రేప్.. ఇప్పుడు నువ్వు నా మమ్మివి అని వదిలేసిన భర్త
ఉత్తరప్రదేశ్‌లో కోడలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేశాడు. బాధితురాలు ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ దుష్టుడు ఆమెనే వదిలించుకోవాలని అనుకున్నాడు. తండ్రి అత్యాచారం చేసినందున ఆమె ఇక నుంచి భార్యగా ఉండలేదని, ఆమె అమ్మ అవుతుందని వక్రభాష్యం చెప్పాడు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన 26 ఏళ్ల భార్యపై తండ్రి రేప్ చేశాడని వదిలిపెట్టాడు. తన తండ్రి రేప్ చేయడంతో ఆమె ఇక తన భార్యగా కొనసాగబోదని, ఆమె తనకు అమ్మి అని చెప్పి వదిలిపెట్టాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సెప్టెంబర్ 7వ తేదీన పోలీసులకు బాదితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, గతేడాది ఆమెకు పెళ్లైంది. భర్త అత్తను తీసుకుని చికిత్స కోసం బయటకు తీసుకెళ్లాడు. అప్పడు అంటే ఆగస్టు 5వ తేదీన మామ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొట్టాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది.
‘మా నాన్న బలవంతంగానైనా నీతో సంబంధం పెట్టుకున్నాడు. ఇక పై నాతో నిన్ను ఉంచుకోలేను. ఎందుకంటే నువ్వు మా నాన్నకు భార్యవు అయ్యావు. ఇప్పుడు నువ్వు నా అమ్మి’ అని భర్త ఆమెతో చెప్పి బయటికి పంపించేశాడు. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులతో ఉంటున్నది. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. కానీ, ఈ విషయాన్ని ఆమె ఫిర్యాదులో పేర్కొనలేదు.
Also Read: హిందువులందరినీ మా పార్టీ స్వాగతిస్తుంది.. సనాతన ధర్మాన్ని పాటించేవారిని కూడా: తమిళనాడు మంత్రి
ఈ ఫిర్యాదు ఆధారంగా ఆమె మామ, భర్తలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ రవీందర్ యాదవ్ తెలిపారు. అధికారిక డాక్యుమెంట్‌గా మెజిస్ట్రేట్‌కు సమర్పించినట్టు వివరించారు.
ఈ ఆరోపణలను ఆమె మామ ఖండించాడు. ఆమె డబ్బులు గుంజడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదని అన్నాడు.