Asianet News TeluguAsianet News Telugu

స‌ర‌దా కోసం కాబోయే భార్య న‌గ్న చిత్రాలను షేర్ చేసిన డాక్ట‌ర్.. కొట్టి చంపిన ఆమె స్నేహితులు

బెంగళూరులో దారుణం జరిగింది. సరదా కోసం ఓ డాక్టర్ తన భార్య ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఆ మహిళ స్నేహితులు అతడిని చితకబాదారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. 

Doctor who shared nude pictures of his fiancee for fun, beaten to death by her friends
Author
First Published Sep 20, 2022, 11:30 AM IST

తన కాబోయే భార్య నగ్న ఫోటోలను తన స్నేహితులతో ఓ డాక్ట‌ర్ షేర్ చేశారు. సోషల్ మీడియాలో కూడా అప్ లోడ్ చేశాడు. ఈ చ‌ర్య‌లే అత‌డి ప్రాణాల మీదికి తెచ్చాడు. కాబోయే భార్య స్నేహితులు క‌లిసి ఆ యువ‌కుడిని హ‌త‌మార్చారు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూర్ లో వారం కింద‌ట చోటు చేసుకోగా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

భారత్ జోడో ప్రచారానికి నితీష్, తేజస్వి యాదవ్‌.. ఆహ్వానం ప‌లికిన కాంగ్రెస్

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. చెన్నైకి చెందిన డాక్ట‌ర్ వికాస్ ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశౄడు. రెండు సంవ‌త్స‌రాలు చెన్నైలో ప్రాక్టీస్ చేశాడు. అయితే నేషనల్ మెడికల్ కమిషన్ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ రాయాల‌ని అనుకున్నాడు. దీని కోసం కోచింగ్ తీసుకోవ‌డానికి నాలుగు నెల‌ల కింద‌ట బెంగ‌ళూరుకు వెళ్లారు.

ఇన్ స్టా రీల్స్ చేయద్దన్నందుకు.. సోదరుడి గొంతుకోసి హత్యాయత్నం, యువతి అరెస్ట్...

అయితే బెంగ‌ళూరుకు చెందిన ఓ మ‌హిళ‌తో వికాస్ రెండేళ్ల నుంచి రిలిష‌న్ షిప్ లో ఉన్నాడు. అయితే కుటుంబ స‌భ్యులు వారి వివాహానికి ఒప్పుకోవ‌డంతో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ వికాష్ తన స్నేహితురాలి పేరును ఉపయోగించి సోషల్ మీడియాలో ఓ అకౌంట్ ఓపెన్ చేసి కాబోయే భార్య నగ్న ఫోటోలను అప్లోడ్ చేశాడు. వాటిని తమిళనాడులోని కొం మంది స్నేహితులతో కూడా షేర్ చేశాడు. అయితే ఆ ఫొటోల‌ను సెప్టెంబ‌ర్ 8వ తేదీన ఇన్ స్టా గ్రామ్ లో తన ఫొటోల‌ను చూసి షాక్ అయిన ఆ మహిళ.. ఈ విష‌యంలో వికాస్ ను ప్ర‌శ్నించింది. అయితే కేవ‌లం స‌ర‌దా కోస‌మే ఇలా చేశాన‌ని అత‌డు చెప్పాడు. 

దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఈ విష‌యాన్ని త‌న క్లాస్ మేట్ సుశీల్ తో చర్చించింది. అత‌డు త‌న స్నేహితులైన గౌత‌మ్, సూర్య‌తో క‌లిసి వికాస్ కు గుణ‌పాటం చెప్పాల‌ని ప్లాన్ చేసుకున్నారు. ప‌థ‌కం ప్ర‌కారం సెప్టెంబర్ 10వ తేదీన వికాస్ ను బెంగ‌ళూరులోని న్యూ మైకో లేఅవుట్ లో ఉన్న సుశీల్ ఇంటికి తీసుకెళ్లింది. అక్క‌డ వారంతా కలిసి కర్ర‌ల‌తో దాడి చేశారు. వికాస్ అపస్మారక స్థితిలోకి చేరుకోవ‌డంతో హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. 

మ‌మ‌తా స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. సీబీఐ, ఈడీ ల‌కు వ్య‌తిరేకిస్తూ ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం

తీవ్రగాయ‌ల‌తో హాస్పిట‌ల్ లో చేరిన వికాస్ ప‌రిస్థితి విష‌మించ‌డంతో సెప్టెంబ‌ర్ 14వ తేదీన మ‌ర‌ణించాడు. మృతుడి సోద‌రుడు విజ‌య్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ఆ మ‌హిళ సూచ‌న‌ల మేర‌కే ఆమె స్నేహితులు వికాస్ పై దాడి చేసిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ సెప్టెంబర్ 16న సుశీల్, గౌతమ్ తో కలిసి ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుపర్చారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు వారిని పోలీసు కస్టడీకి అప్ప‌గించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios