Asianet News TeluguAsianet News Telugu

భారత్ జోడో ప్రచారానికి నితీష్, తేజస్వి యాదవ్‌.. ఆహ్వానం ప‌లికిన కాంగ్రెస్

Patna: కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌.. రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో కన్యాకుమ‌రి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. 3,570 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాత్ర దాదాపు 150 రోజులు కొన‌సాగ‌నుంది. 
 

Congress invites Nitish Kumar, Tejashwi Yadav to campaign for Bharat Jodo Yatra
Author
First Published Sep 20, 2022, 11:02 AM IST

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం ద‌క్షిణ భార‌తంలో కొన‌సాగుతున్న ఈ దేశ‌వ్యాప్త యాత్ర మ‌రికొన్ని రోజుల్లో ఉత్త‌ర‌భార‌తంలోకి ప్ర‌వేశించ‌నుంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి ఇత‌ర పార్టీల నేత‌ల‌తో కలిసి ప్రజల్లోకి మ‌రింత దూసుకుపోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. భారత్ జోడో ప్రచారానికి నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌లను కాంగ్రెస్ ఆహ్వానించింద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఇందులో పాల్గొనేందుకు ఇరువురు నేతలు అంగీకారం తెలిపినట్లు స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్తే... కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌.. రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో కన్యాకుమ‌రి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. 3,570 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాత్ర దాదాపు 150 రోజులు కొన‌సాగ‌నుంది. భారత్ జోడో యాత్ర సంద‌ర్భంగా రాహుల్ గాంధీ దేశంలోని ప్ర‌జా స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలను ప్ర‌స్తావిస్తూ.. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో కొన‌సాగుతున్న యాత్ర‌లో ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. భార‌త్ జోడో క్యాంపెయ‌న్ కు మ‌రింత ప్ర‌చారం క‌ల్పించేందుకు ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల సేవ‌ల‌ను సైతం ఉప‌యోగించుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌రికొన్ని రోజుల్లో ఉత్త‌ర‌భార‌తంలోకి చేరుకోనుంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి ఇత‌ర పార్టీల నేత‌ల‌తో మ‌రింత దూసుకుపోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. భారత్ జోడో ప్రచారానికి నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌లను కాంగ్రెస్ ఆహ్వానించింద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఇందులో పాల్గొనేందుకు ఇరువురు నేతలు అంగీకారం తెలిపినట్లు స‌మాచారం.

బీహార్ రాష్ట్ర ఇన్‌చార్జి భక్త చరణ్ దాస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌లను కలిసి పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో ప్రచారానికి ఆహ్వానించారు. ఇద్దరు నేతలు పాల్గొనేందుకు సమ్మతి తెలిపారని, అయితే ఆయన ఆరోగ్యం బాగాలేనందున, ఆయన కుమారుడు, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ ఆయన తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని సంబంధిత‌ వర్గాలు తెలిపాయి. అంతకుముందు రోజు, భ‌క్త చ‌ర‌ణ్ దాస్, రాష్ట్ర చీఫ్ మదన్ మోహన్ ఝా సహా ఇతర నాయకులతో పాటు, నితీష్ కుమార్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కోటా కింద ఉన్న మంత్రులు, పార్టీ ప్రధాన కార్యాలయం సడకత్ ఆశ్రమంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడి ఎంపికపై రెండు ప్రతిపాదనలు తీసుకువ‌చ్చారు. సంబంధిత‌ మూలాల ప్రకారం, ఝా పదవీకాలం కొద్ది రోజుల్లో ముగియనుంది. ఆయ‌న ప‌ద‌వికాలాన్ని పొడింగించే అవ‌కాశం లేద‌ని తెలిసింది. అలాగే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి ఏకగ్రీవంగా మద్దతు పలికారు.

"తాజా స‌మావేశం సంద‌ర్భంగా సోమవారం వచ్చిన రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించాము. ప్రస్తుత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దీనిపై నిర్ణయం తీసుకుంటారని" దాస్ చెప్పారు. అలాగే, "రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశంలోని కాంగ్రెస్ కార్యకర్తలలో కొత్త శక్తిని నింపింది. అతను పెద్ద ఎత్తున పాపులారిటీని పొందుతున్నాడు. ప్రజలు ఆయనకు మద్దతు ఇస్తున్నారని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని ఆశిస్తున్నామ‌ని" తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios