Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ గ్యాంగ్ రేప్: పదేళ్ల బాలుడిపై ముగ్గురు ఫ్రెండ్స్ లైంగికదాడి.. ప్రైవేట్ పార్టులో రాడ్లు.. బాధితుడి మరణం

ఢిల్లీలో పదేళ్ల బాలుడిపై ముగ్గురు ఫ్రెండ్స్ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇటుకలు, రాడ్లతోనూ భౌతిక దాడి చేశారు. బాలుడి ప్రైవేటు పార్టులో రాడ్లను జొప్పించారని వైద్యులు చెప్పారు. ఈ దారుణ ఘటన తమకు నిర్భయ కేసును గుర్తుకు తెచ్చిందని పేర్కొనడం గమనార్హం. ఆ బాలుడు ఈ రోజు ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించాడు.

delhi boy who sexually assaulted by his three friends died in hospital
Author
First Published Oct 1, 2022, 12:53 PM IST

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. పదేళ్ల బాలుడిపై అతని ఫ్రెండ్సే అఘాయిత్యానికి పాల్పడ్డారు. క్రూరంగా లైంగిక దాడికి ఒడిగట్టారు. బాలుడి ప్రైవేట్ పార్టులో రాడ్లు జొప్పించారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి కూడా బాలుడి తల్లిదండ్రులు సంశయించారు. నాలుగు రోజుల తర్వాత బాలుడిని హాస్పిటల్ చేర్చారు. కానీ, అప్పటికే బాలుడి ఆరోగ్యం దారుణంగా దిగజారిపోయింది. ఆ బాలుడు ఈ రోజు చికిత్స పొందుతూ హాస్పిటల్ ఐసీయూలోనే కన్నుమూశాడు.

బాలుడి గాయాలు చూసి వైద్యులు కూడా ఖంగుతిన్నట్టు తెలిసింది. ఈ దాడి తమకు 2012 డిసెంబర్ 16న జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్‌ను జ్ఞప్తికి తెచ్చిందని వైద్యులు చెప్పినట్టు సమాచారం.

ఈ నేరంలో ప్రమేయం ఉన్నవారంతా పది నుంచి 12 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. 

మూడు రోజుల క్రితం భౌతిక దాడికి గురయ్యాడనే పేరుతో ఓ బాలుడిని ఢిల్లీలోని ఎల్ఎన్‌జేపీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 22న వైద్యులు సీలంపూర్ పోలీసు స్టేషన్‌కు తెలియజేశారు. పోలీసులు వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్నారు. ఆ బాలుడి తల్లిదండ్రులను కలిశారు. కానీ, ఆ తల్లిదండ్రులు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. అప్పుడు బాలుడు మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉన్నాడు.

ఈ ఘటనపై ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ కూడా రిపోర్ట్ చేసింది. పోలీసులకు నోటీసులు పంపింది. వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తన కుమారుడిపై లైంగిక దాడి జరిగిందని ఓ మహిళ తమకు ఫిర్యాదు అందించాని డీసీడబ్ల్యూ పేర్కొంది.

కుటుంబ సభ్యులు ఆ బాలుడిని నాలుగు రోజుల తర్వాత హాస్పిటల్ తీసుకువచ్చారని, తద్వార ఆయన ఆరోగ్య పరిస్థితి దారుణంగా దిగజారిందని వైద్యులు వివరించారు.

పోలీసులు ఆ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 24న కుటుంబం స్టేట్‌మెంట్ ఇచ్చింది. తమ కుమారుడిని భౌతికంగా దాడి చేశారని, ముగ్గురు ఫ్రెండ్స్ తమ కుమారుడిపై లైంగిక దాడి చేశారని తల్లి వివరించింది. తమ కుటుంబం గడువులోపు బాకీ తీర్చని కారణంగా ముగ్గురు ఫ్రెండ్స్ తన కుమారుడిపై లైంగిక దాడి చేశారని ఆరోపించింది.

తల్లి స్టేట్‌మెంట్ ఆధారంగా ఐపీసీ సెక్షన్ 377, పోక్సోలోని సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. 

ఆ దుండగులు తమ కుమారుడిని ఇటుకలు, రాడ్లతోనూ దాడి చేశారని వివరించారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల (ఇందులో ఒకరు కజిన్ కూడా ఉన్నాడు) ను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు పోలీసులు హాజరుపరిచారు. కాగా, మూడో బాలుడి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios