Asianet News TeluguAsianet News Telugu

బాలుడితో కానిస్టేబుల్ స్వలింగ సంపర్కం...నెల రోజులుగా స్టేషన్‌కు పిలిచి మరీ

ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన రక్షకభటులే..జనం పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఒక కానిస్టేబుల్... బాలుడితో స్టేషన్‌లోనే అసహజ లైంగిక క్రీడకు పాల్పడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Constable arrested for sexual assault on boy in UP
Author
Uttar Pradesh, First Published Oct 3, 2018, 2:10 PM IST

ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన రక్షకభటులే..జనం పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఒక కానిస్టేబుల్... బాలుడితో స్టేషన్‌లోనే అసహజ లైంగిక క్రీడకు పాల్పడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని చామద్‌గేట్ పోలీస్ స్టేషన్‌లో 45 ఏళ్ల సంజేశ్ యాదవ్ అనే కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ రోజున గస్తీ నిర్వహిస్తున్న సంజేశ్ యాదవ్ అల్పాహారం చేసేందుకు రోడ్డు పక్కన ఉన్న చిన్న హోటల్‌లోకి వెళ్లాడు.

ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్ ఓ బాలుడిపై కానిస్టేబుల్‌కు వికృత కోరిక కలిగింది.. బాలుడిని మచ్చిక చేసుకుని తరచూ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అతనితో అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవాడు. అలా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 1 మధ్య తరచూ స్టేషన్‌కు రప్పించాడని పోలీసులు తెలిపారు.

మంగళవారం గాంధీ జయంతి సందర్భంగా కానిస్టేబుల్ సెలవుపై వెళ్లడంతో బాలుడు స్టేషన్‌కు వచ్చి ఉన్నతాధికారులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. అసహజ లైంగిక క్రీడతో పాటు తనను తీవ్రంగా గాయపరిచాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి చలించిపోయిన అధికారులు.... కానిస్టేబుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios