భారత ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర హోంశాఖ CISF (Central Industrial Security Force) సిబ్బంది సంఖ్యను పెంచేందుకు అనుమతించింది. దీంతో పారిశ్రామిక, వ్యూవాహాత్మక ప్రాంతాల్లో భద్రత మరింత మెరుగుకానుంది.
KNOW
2029 నాటికి 70,000 కొత్త నియామకాలు
ప్రతి సంవత్సరం సుమారు 14,000 మంది కొత్త సిబ్బందిని నియమించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ నియామకాలు వచ్చే ఐదు సంవత్సరాల్లో జరుగుతాయి. 2024లో ఇప్పటికే 13,230 మందిని నియమించారు, ప్రస్తుతం 24,098 నియామకాలు 2025లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 1,62,000గా సీఐఎస్ఎఫ్ సిబ్బందిని 2,20,000కి పెంచేందుకు కేంద్రం అనుమతించింది.
మహిళల నియామకాలకు ప్రాధాన్యం
CISFలో మహిళల సంఖ్యను పెంచే విధానాలు అమలు చేస్తున్నారు. ఈ నియామకాల ద్వారా మహిళా అభ్యర్థులకు కూడా పెద్ద అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. అదనంగా, సిబ్బంది పెరుగుదలతో అంతర్గత భద్రత కోసం కొత్త బెటాలియన్ ఏర్పాటు చేయనున్నారు.
ప్రాధాన్య భద్రతా ప్రాంతాలు
CISF భద్రతా పరిధి విమానాశ్రయాలు, పోర్టులు, థర్మల్ పవర్ ప్లాంట్లు, న్యూక్లియర్ ప్లాంట్లు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు, జమ్మూ కాశ్మీర్ జైల్లు వంటి ముఖ్య ప్రాంతాలపై కేంద్రీకృతమవుతుంది. దీంతో చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం తగ్గి, కొత్త పారిశ్రామిక కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉంది. వాటికి CISF భద్రత అవసరం అవుతుంది. ఈ లక్ష్యంతోనే పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టున్నారు.
ఇటీవలి విస్తరణలు
గత ఏడాది CISF భద్రతా విభాగంలో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్, అయోధ్య విమానాశ్రయం, NTPC మైనింగ్ ప్రాజెక్ట్ (హజారీబాగ్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (పూణే), బక్సర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, జవహర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఇటాహ్), బియాస్ సట్లుజ్ లింక్ ప్రాజెక్ట్ (మాండీ) వంటి 7 కొత్త యూనిట్లను చేర్చారు. ఫైర్ విభాగంలో కూడా 2 కొత్త యూనిట్లు ఏర్పాటు జరిగింది.
