ఒడిషాలో దారుణం జరిగింది.. తొమ్మిదేళ్ల చిన్నారిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాలోని గంజాం జిల్లా కవిసూర్యనగర్ సమీపంలోని దొయికొన గ్రామంలో దొంగలు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. కుటుంబసభ్యులంతా పడుకుని ఉండటంతో దొరికినకాడికి దోచుకెళ్లారు.

ఈ క్రమంలో తెల్లవారుజామున లేచి చూసిన ఓ వివాహిత తన పక్కలో పడుకున్న తొమ్మిదేళ్ల కుమార్తె కనిపించకపోవడంతో.. భర్తను నిద్రలేపింది.. వారు లేచి చూసేసరికి ఇంట్లోని సామాగ్రి చెల్లాచెదురుగా పడివుంది. అల్మారాలో దాచివుంచిన రూ. 20 వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు దంపతులు గుర్తించారు. దొంగతనానికి వచ్చిన దొంగలే తమ కుమార్తెను ఎత్తుకుపోయి ఉంటారని అనుమానించి... స్థానికుల సాయంతో బాలిక కోసం గాలించారు.

ఈ సమయంలో వారికి చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ముసుగులు ధరించిన ముగ్గురు యువకులు తనను ఎత్తుకుని గడ్డివాము చాటుకు తీసుకెళ్లారని.. అరిస్తే చంపేస్తామని బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక పేర్కింది. దీనిపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

విజయవాడలో దారుణం: యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ స్నేహితులు

దారుణం: స్నేహితుడి భార్యపై గ్యాంగ్‌రేప్‌, ఫోన్ నెంబర్ అడిగి ఇలా....

యువతిపై సామూహిక అత్యాచారం చేయించిన మహిళ

గుంటూరులో ఘోరం... రాత్రంతా నర్సుపై సామూహిక అత్యాచారం

దేశ రాజధాని డిల్లీలో మరో దారుణం : ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం

ఇద్దరు బాలికలపై రెండు నెలలకు పైగా పదే పదే గ్యాంగ్ రేప్