దేశ రాజధాని డిల్లీలో మరో దారుణం : ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం

First Published 30, May 2018, 11:29 AM IST
A woman was sexually assaulted by 5 mens in delhi
Highlights

మహిళను కిడ్నాప్ చేసి...ఐదుగురు యువకులు కలిసి అత్యాచారం

దేశ రాజధాని డిల్లీలొ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అక్కడ ఆడవారు ఇంట్లోంచి బయటకు రావాలంటేనే బయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. నిర్భయ ఘటన దేశవ్వాప్తంగా సంచలనం సృష్టించి, కేంద్ర ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేసినప్పటికి ఆడవారిపై ఆగడాలు ఆగడం లేదు. 

 డిల్లీ లో తాజాగా మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్ గావ్ ప్రాంతంలోని సహారామాల్ వద్ద ఆటో కోసం వేచి వున్న ఓ మహిళను లిప్ట్ ఇస్తానని ఓ ట్యాక్సీ డ్రైవర్ నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మి ఆమె అతడి ట్యాక్సీలో ఎక్కింది. దీంతో అతడు నేరుగా ఆ ట్యాక్సీని దక్షిణ డిల్లీలోని ఓ అతిథి గృహానికి తీసుకెళ్లి ఆమెను ఓ రూంలో బంధించాడు. అనంతరం ఓ ఐదుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం ఆమెను వదలకుండా అక్కడే బంధించి ఉంచారు. అయితే సదరు మహిళ ఆ అతిథి గృహ వంటవాడి సాయంతో అక్కడినుండి తప్పించుకుని తన స్నేహితురాలి వద్దకు చేరింది. వీరిద్దరు కలిసి వసంత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. 

  

loader