బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మగడి తాలూకాలోని  కుదురు మండలం రామనగరలో  ముగ్గురు వ్యక్తులు ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని పోలీసులు రాజేశ్వర్ నగర్ ఆసుపత్రిలో చేర్పించారు.

పురుషోత్తం,  మంజునాథ్, కార్దీలు  తన స్నేహితుడి భార్యపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.నిందితులు బాధితురాలి ఇంటి తలుపును బద్దలుకొట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

శనివారం రాత్రి పదిన్నర గంటలకు భర్త ఇంట్లో లేని  సమయాన్ని ఆసరాగా చేసుకొని  నిందితులు బాధితురాలి ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండు మాసాలుగా అతను డ్యూటీపై వెళ్లాడు . 

బాధితురాలు, ఆమె 18 ఏళ్ల కొడుకుతో ఇంట్లో ఉంటుంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన స్నేహితులు బాధితురాలి ఇంటి తలుపులను పగులగొట్టి ఆమెపై దాడికి పాల్పడి అత్యాచారానికి పాల్పడ్డారు.

రాత్రి పదకొండున్నర గంటల సమయంలో బాధితురాలి ఇంటికి వచ్చిన నిందితులు తలుపు కొట్టారు. అయితే కిటీకీ తెరిచిన బాధితురాలు ఎందుకు వచ్చారనే విషయాన్ని విచారించింది. అయితే బాధితురాలి భర్త నెంబర్ కావాలని నిందితులు అడిగారు. అయితే మరునాడు రావాలని బాధితురాలు చెప్పింది.

దీంతో ఆగ్రహించిన నిందితులు తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి దూరి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ విషయమై బాధితురాలు అరవడంతో స్థానికులు వచ్చారు. అప్పటికే నిందితులు పారిపోయారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం గాలింపు చర్యలను చేపట్టింది.