Asianet News TeluguAsianet News Telugu

UP Assembly elections 2022 : స్నానం చేస్తున్న వ్యక్తి దగ్గరికెళ్లి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం... వీడియో వైరల్..

కాన్పూర్ bjp MLA సురేంద్ర గురువారం తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం చేపట్టాడు. ప్రతి ఇంటికీ తిరుగుతూ.. Votersతో ముచ్చటించాడు. అలా ఓ ఇంటి లోపలికి వెళ్లి స్నానం చేస్తున్న వ్యక్తి తో మాట్లాడారు. అంతా బాగానే ఉందా? ఇల్లు పూర్తయిందా? రేషన్ కార్డు ఉందా? అంటూ ప్రశ్నించారు. వీటన్నింటికి సదరు వ్యక్తి స్నానం చేస్తూనే ‘ఉంది’ అని సమాధానమిచ్చారు.

Campaigning BJP MLA Asks Man, Bathing in Kanpur
Author
Hyderabad, First Published Jan 14, 2022, 1:12 PM IST

కాన్పూర్ : Uttar Pradesh Assembly electionల వేళ ఓట్ల కోసం నేతలు పడే పాట్లు అన్నీ-ఇన్నీ కావు ఓటర్ మహాశయులను ఆకర్షించేందుకు ఎన్ని ఫీట్లు అయినా చేస్తారు.  ప్రచారం కోసం ఎన్ని తిప్పలు అయినా పడతారు.  ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సందడి జోరందుకుంది.  పోలింగ్ తేదీలు సమీపిస్తుండడంతో రాజకీయ నాయకులు ప్రచారంలో వేగం పెంచారు. అలా ఇంటింటి ప్రచారం చేపట్టిన ఓ ఎమ్మెల్యే కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు.  ఏకంగా  స్నానం చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి మరీ ప్రచారం చేశాడు.  వివరాల్లోకి వెళితే…

కాన్పూర్ bjp MLA సురేంద్ర గురువారం తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం చేపట్టాడు. ప్రతి ఇంటికీ తిరుగుతూ.. Votersతో ముచ్చటించాడు. అలా ఓ ఇంటి లోపలికి వెళ్లి స్నానం చేస్తున్న వ్యక్తి తో మాట్లాడారు. అంతా బాగానే ఉందా? ఇల్లు పూర్తయిందా? రేషన్ కార్డు ఉందా? అంటూ ప్రశ్నించారు. వీటన్నింటికి సదరు వ్యక్తి స్నానం చేస్తూనే ‘ఉంది’ అని సమాధానమిచ్చారు.

ఇందుకు సంబంధించిన ఫోటోను  ఎమ్మెల్యే తన ఇంస్టాగ్రామ్  ఖాతాలో షేర్ చేశారు.  ‘గృహ పథకం కింద ఇంటిని నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశాను. ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించమని  కోరాను’ అని ఎమ్మెల్యే రాసుకొచ్చారు.  స్నానం చేస్తున్న వ్యక్తితో సురేంద్ర మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో బిజెపి, సమాజ్ వాది పార్టీ ప్రధాన ప్రత్యర్ధులుగా కనిపిస్తున్నారు.  మరోవైపు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 125 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇక బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా సమావేశం అయ్యింది. త్వరలోనే జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

 ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల వేళ యూపీలో కమలానికి  వరుస షాకులు తగులుతున్నాయి.  ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు సహా ఎనిమిది మంది నేతలు పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే వీరు సమాజ్ వాది పార్టీ లో చేరే అవకాశాలు ఉన్నట్లు  వార్తలు వస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకుషెడ్యూల్‌ వెలువడిన తర్వాత అక్కడి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య‌ (Swami Prasad Maurya) తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆయన బాటలో మరికొందరు నడవడంతో.. బీజేపీ వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటివరకు యోగి కేబినెట్‌‌లో ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసిన నేతలు అంతా చెబుతున్న కారణం ఒకే విధంగా ఉంది. 

 

.

Follow Us:
Download App:
  • android
  • ios