కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న కేఫ్ కాఫీ డే వ్యవస్థపాకులు వి.జి. సిద్ధార్థ తండ్రి గంగయ్య హెగ్డే కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న గంగయ్య కొద్దిరోజుల నుంచి మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

గత నెలలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చివరిసారిగా చూసి అనంతరం నేత్రావతి నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.

కాగా.. సిద్ధార్ధ చనిపోయిన సంగతి గంగయ్యకు ఇంతవరకు తెలియకపోవడం దురదృష్టకరం. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు గత నెల 31న మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై నుంచి నడుచుకుంటూ వెళుతూ అదృశ్యమవ్వడం కలకలం రేపింది.

దీంతో ఆయన కోసం కర్ణాటక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాలించారు. 36 గంటల పాటు నేత్రావతి నదిని జల్లెడపట్టిన అనంతరం సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు.

ఆదాయపు పన్నుశాఖ వేధింపులతో పాటు ప్రైవేట్ ఈక్విటీ మేనేజర్ నుంచి ఒత్తిడి కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సిద్ధార్థ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. 

అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: బ్రిడ్జి నుండి దూకడం చూశా, కానీ...

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: కీలక సమాచారమిచ్చిన డ్రైవర్

సిద్ధార్థ అదృశ్యం... కేఫ్ కాఫీడే ఉద్యోగులకు సెలవు

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...