Asianet News TeluguAsianet News Telugu

విశ్వాస పరీక్షలో నెగ్గిన యడియూరప్ప

కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడియూరప్ప విజయం సాధించారు. విశ్వాస పరీక్షకు అనుకూలంగా 106 మంది ఓట్లు వేశారు.

BS Yediyurappa wins trust vote by voice vote
Author
Bangalore, First Published Jul 29, 2019, 11:50 AM IST

బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడియూరప్ప విజయం సాధించారు. విశ్వాస పరీక్షకు అనుకూలంగా 106 మంది ఓట్లు వేశారు.

106 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు అనుకూలంగా ఓటు వేశారు. అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో యడియూరప్పకు 106 మంది ఓట్లు దక్కాయి.

సోమవారం నాడు అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ తీర్మానం సందర్భంగా యడియూరప్ప చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, కుమారస్వామిలు స్పందించారు. 

ఈ చర్చ తర్వాత సీఎం యడియూరప్ప బలపరీక్షలో విజయం సాధించారు. మూజువాణి ఓటు ద్వారా బల పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్షలో సీఎం యడియూరప్పకు అనుకూలంగా 106 ఓట్లు వచ్చాయి.

 

సంబంధిత వార్తలు

ప్రారంభమైన అసెంబ్లీ: మరికొద్దిసేపట్లో యడియూరప్ప బలపరీక్ష

యడియూరప్ప బలపరీక్ష: విప్ జారీ చేసిన బీజేపీ

కర్ణాటక స్పీకర్ గా రమేష్ కుమార్ రాజీనామా?

నేడే బలపరీక్ష: నాదే విజయమన్న యడ్డీ

రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు: మ్యాజిక్ ఫిగర్ 105, ఎవరికీ లాభం?

షాక్: 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటేసిన స్పీకర్

Follow Us:
Download App:
  • android
  • ios