Asianet News TeluguAsianet News Telugu

ఆ రేప్ కేసులో నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలి.. కానీ, ఓ కండీషన్..: బాంబే హైకోర్టు తీర్పు

బాంబే హైకోర్టు ఓ రేప్ కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చింది. అయితే, బాధితురాలిని ఏడాదిలోపు పెళ్లి చేసుకోవాలని కండీషన్ పెట్టింది. ఆ తర్వాత ఈ కండీషన్ వర్తించదని వివరించింది. నిందితుడితో గర్భం దాల్చిన ఆ యువతి డెలివరీ అయింది. ఆ పాపను ఓ బిల్డింగ్ ముందు ఉంచి కనిపించకుండా పోయింది. పోలీసులు ఆ పాపను వేరే వారికి దత్తత ఇచ్చారు.
 

bombay high court grants bail to rape accused puts condition to marry victim within one year
Author
First Published Oct 17, 2022, 3:25 PM IST

ముంబయి: బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. ఓ రేప్ కేసులో బాధితురాలిని నిందితుడు పెళ్లి చేసుకోవాలని ఆదేశించింది. అందుకు ఓ ఏడాది కాలం కండీషన్ పెట్టింది. ఈ కండీషన్ పేర్కొంటూ నిందితుడికి రూ. 25 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

26 ఏళ్ల యువకుడు, 22 ఏళ్ల యువతి ఇద్దరూ ఇష్టపడే సుమారు 2018 నుంచి ఒక రిలేషన్‌షిప్ మొదలు పెట్టారు. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో శారీరకంగానూ కలిశారు. వీరిద్దరి సంబంధం గురించి పెద్దలకూ తెలుసు. కానీ, ఇంతలో 2019లో ఆమె గర్భం దాల్చడం అన్ని పరిస్థితులను మార్చివేసింది.

తాను గర్భం దాల్చినట్టు యువతి.. ఆ యువకుడికి తెలిపింది. కానీ, అప్పటి నుంచి ఆమె నుంచి డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడం ఆ యువకుడు మొదలు పెట్టాడు. చివరకు ఆమెను మొత్తంగానే అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాడు. ఇదంతా ఆ యువతికి అర్థం అయింది. కానీ, గర్భం దాల్చిన విషయం ఇంటిలో చెప్పలేదు. ఆ విషయం ఇంటిలో తెలియడం ఇష్టం లేక ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయింది. 

Also Read: సీన్ రివర్స్.. అత్యాచారం కేసు పెట్టిన యువతినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ట్విస్ట్ ఏంటంటే...

2020 జనవరి 27న ఓ హాస్పిటల్ వెళ్లి డెలివరీ అయింది. పుట్టిన బేబీని ఓ బిల్డింగ్ ఎదురుగా వదిలిపెట్టింది. బేబీని వదిలిపెట్టినందుకు ఆ యువతిపై వేరే ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం ఆమె ఆచూకీ తెలియదు.

ఫిబ్రవరి 2020లో ఆమె ముంబయి పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చింది. తనను రేప్ చేశాడని, చీట్ చేశాడని యువకుడిపై కంప్లైంట్ ఇచ్చింది. అయితే, గతంలో తాము ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నామని కూడా స్పష్టం చేసింది.

ఈ పిటిషన్ పై బాంబే హైకోర్టు విచారించింది. వారిద్దరూ గతంలో ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నామని యువతి పేర్కొందని జస్టిస్ భారతి డాంగ్రే సింగిల్ బెంచ్ తెలిపింది. ఆ యువతిని ఒక ఏడాదిలోపు పెళ్లి చేసుకోవాలనే కండీషన్‌తో అక్టోబర్ 12న బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ కండీషన్ వర్తించదని, బెయిల్ రద్దు అవుతుందని వివరించింది.

ఆ యువకుడు కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి, ఆ బిడ్డకు తండ్రిగా ఉంటానని అంగీకరించాడు. 

అయితే, ఆ యువతి ఇప్పుడు కనిపించడం లేదని, ఆమె వదిలిపెట్టిన బిడ్డను కూడా ఇతరులకు దత్తత ఇచ్చామని పోలీసులు చెప్పారు.

ఆ యువతి ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నామని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. యువకుడికి కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ, పై కండీషన్ పెట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios