సీన్ రివర్స్.. అత్యాచారం కేసు పెట్టిన యువతినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ట్విస్ట్ ఏంటంటే...
సదరు యువతి తన తల్లి తో గురు గ్రామ్ లో నివసిస్తోంది. ఆమెకు Honeytrap పేరుతో మగవారిని వలవేసి డబ్బులు గుంజడం అలవాటుగా మారింది. ఆమె వలలో చిక్కుకున్న వారిపై నకిలీ అత్యాచారం కేసులు పెట్టి వేధించడం ప్రారంభించింది. తాజాగా ఆమె 8 మంది పై అత్యాచారం కేసు విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.
గురు గ్రామ్ : తనపై rape జరిగిందని ఫిర్యాదు చేసిన 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన Haryanaలోని గురు గ్రామ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనపై ఎనిమిది మంది అత్యాచారం చేశారని ఓ woman పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
సదరు యువతి తన తల్లి తో గురు గ్రామ్ లో నివసిస్తోంది. ఆమెకు Honeytrap పేరుతో మగవారిని వలవేసి డబ్బులు గుంజడం అలవాటుగా మారింది. ఆమె వలలో చిక్కుకున్న వారిపై నకిలీ అత్యాచారం కేసులు పెట్టి వేధించడం ప్రారంభించింది. తాజాగా ఆమె 8 మంది పై అత్యాచారం కేసు విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.
ఆమె ఫేక్ అత్యాచారం కేసు పెట్టి పలువురు పురుషుల వద్ద హనీట్రాప్ ముసుగులో డబ్బు లాగుతోందని పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో ఆ యువతి తల్లితో పాటు నరేందర్ యాదవ్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నారని ఏసీపీ (క్రైమ్) ప్రీత్ పాల్ సింగ్ సాంగ్వాన్ తెలిపారు. పోలీసులు ఆమెను బుధవారం కోర్టుకు హాజరు పరచి, ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
సవతులతో కలిసి ఉండాలని, బలవంతంగా కాపురం చేయమని భార్యకు చెప్పలేం.. గుజరాత్ కోర్టు సంచలన తీర్పు..
కాగా, ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంరక్షకుడిగా ఉన్న వ్యక్తే ఆ ఇద్దరు చిన్నారుల పాలిట కీచకుడయ్యాడు. ఐదు నెలలుగా వారిపై అత్యాచారం చేస్తున్నా ఏం జరుగుతుందో తెలియని పసి హృదయాలు.. బైటికి చెప్పుకోలేకపోయాయి. ఈ హృదయవిదారక సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణలోని Nizamabadజిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమార్తె, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు మనవరాళ్లతో రెండేళ్లుగా పెంటపాడులో ఉంటుంది.
Thadepalligudem తాళ్లముదునూరుపాడుకు చెందిన ఉసుమర్తి పవన్ కుమార్ (30) వారితో పాటే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళ కుమార్తె ఐదు నెలల కిందట జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లగా బాలికలు అమ్మమ్మ, పవన్ కుమార్ సంరక్షణలో ఉంటున్నారు.
రెండు రోజుల కిందట ఆ చిన్నారులు ఇద్దరూ పొత్తి కడుపులో నొప్పిగా ఉంటోందని అమ్మమ్మకు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన ఆమె ప్రశ్నించింది. ఆ చిన్నారులిద్దరూ తమకు ఏం జరిగిందో.. విషయాన్ని అమ్మమ్మకు తెలిపారు. అది విన్న అమ్మమ్మ తట్టుకోలేకపోయింది. వెంటనే బుధవారం రాత్రి పెంటపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదయ్యింది. గురువారం ఏలూరు పోలీస్స్టేషన్ డిఎస్పి కేవీ సత్యనారాయణ, తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ రవికుమార్ బాధితులను కలిసి వివరాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులకు వైద్య పరీక్షలు చేయించారు. నివేదిక రావల్సి ఉంది.