Asianet News TeluguAsianet News Telugu

వైరల్: ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

 ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా.. ఆయన ఓ వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
 

Anand Mahindra Shares Hilarious Video Of Nature Taking "Revenge In Style"
Author
Hyderabad, First Published Aug 24, 2022, 9:47 AM IST

మనం మనుషులం.. మనకు అన్నీ తెలుసు అనే అహంభావంతో... మనమంతా ప్రకృతిని నాశనం చేస్తున్నాం. మనకు ఆక్సీజన్ అందించే చెట్లను, అడవులను నరికేసి.. అక్కడ భవనాలు కట్టేస్తున్నాం. మనం చేస్తున్న ప్రకృతి విధ్వంసమే.. అనేక సమస్యలకు కారణమౌతుంది. మనం నరుకుతున్న చెట్లకు ఒక్కసారి కోపం వస్తే.. అవి మనపై తిరగబడితే... మనం తట్టుకోగలమా..?  ఇలా జరిగే ఛాన్స్ లేదులే అని అనుకుంటున్నారా..? ఈ వీడియో చూస్తే.. ప్రకృతికి కూడా కోపం వస్తుంది.. మన మీద రివేంజజ్ తీర్చుకుంటుంది అనే విషయం స్పష్టంగా అర్థమౌతుంది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా.. ఆయన ఓ వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.


ఆ వీడియోలో.. ముగ్గురు వ్యక్తులు అడవిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను నరకడం మొదలుపెట్టారు. వారు నరికిన చెట్టే.. వారిలో ఒకరిని ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో.. వీడియో కాస్త వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే ఎవరికైనా నవ్వు రాకుండా ఉండదు. అయితే... అక్కడ సీరియస్ నోట్ ఏమిటంటే.. మన అవసరాల కోసం చెట్లను నరికితే.. ఆ ప్రకృతి కూడా కోపం వస్తుంది అనే అంతర్థాన్ని ఆ వీడియో మనకు అందిస్తోంది.  కావాలంటే.. ఆ వీడియోని మీరు కూడా చూడవచ్చు.

ఈ వీడియోకి 630,000 వ్యూస్ రావడం గమనార్హం. కాగా.. నెటిజన్లు ఈ వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రకృతికి కోపం వస్తే ఇలానే ఉంటుంది అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. ఇంకొందరేమో.. ప్రకృతిని నాశనం చేయాలనిచూస్తే.. అస్సలు క్షహించదు అని కామెంట్స్ చేయడం గమనార్హం. తన స్టైల్ లో రివేంజ్ తీర్చుకుందని కొందరు కామెంట్స్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios