Asianet News TeluguAsianet News Telugu

Bihar politics: బీజేపీ-జేడీయూ విడిపోతే బీహార్ అసెంబ్లీ రాజకీయాలు ఎలా మారుతాయంటే..?

Bihar Assembly: చాలా కాలం నుంచి బీజేపీ మిత్ర‌ప‌క్ష నాయ‌కుడు నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీయే కూట‌మికి గుడ్ బై చెప్ప‌బోతున్నార‌నే ప్ర‌చారం  జ‌రుగుతోంది. ఇప్పుడు ఈ అంశం బీహార్ తో పాటు దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 
 

Bihar  politics: If the BJP-JD(U) split, the politics of the Bihar Assembly may be like this.
Author
Hyderabad, First Published Aug 8, 2022, 4:48 PM IST

BJP-JD(U) split: బీహార్‌లో జనతాదళ్ (యూనైటెడ్) (జేడీయూ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమిలో చీలికలు మొదలయ్యాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికి ప్ర‌స్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాలు సైతం నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. ఎందుకంటే బీహార్‌లో ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత అధినేత నితీష్ కుమార్ మంగళవారం ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో సమావేశానికి పిలుపునివ్వడంతో రాజకీయ కలకలం రేగుతోంది. 12 సంవత్సరాల క్రితం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) నుండి నిష్క్రమించి JD(U)లో చేరిన బ్యూరోక్రాట్ నుండి రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి RCP సింగ్ రాజీనామా చేసిన తర్వాత  ఈ ప‌రిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. 

బీహార్ లో అధికార కూటమి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి నితీష్ కుమార్ ఈ సమావేశాన్ని పిలిచినట్లు సంబంధిత‌ వర్గాల సమాచారం. జేడీ(యూ)-బీజేపీ పాలిత రాష్ట్రంలో మరో 48 గంటల్లో పెను రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంద‌నే సంకేతాలు అందుతున్నాయి. ఆదివారం  ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 7వ సమావేశానికి నితీశ్ కుమార్ గైర్హాజరవడంతో బీజేపీ-జేడీ(యూ) మధ్య విభేదాలు మరింత స్పష్టంగా కనిపించాయి. ఇది వరకు ఎన్డీయే కూటమి కీలక సమావేశాలకు సైతం ఆయన దూరంగా ఉన్నారు. ఒక‌వేళ సంకీర్ణ ప్ర‌భుత్వం కొన‌సాగిస్తున్న బీహార్ లో బీజేపీ-జేడీ(యూ) విడిపోతే ఏం జ‌రుగుతుంద‌నే దానిపై కొత్త చ‌ర్చ న‌డుస్తోంది. రాష్ట్రం అసెంబ్లీలో వివిధ పార్టీల బ‌లాబ‌లాలు గ‌మ‌నిస్తే.. 

1. బీహార్ శాసనసభలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్కు 122 స్థానాలు. 
 
2. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మొత్తం 127 మంది శాసనసభ్యులను కలిగి ఉంది. 

3. రాష్ట్ర అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధిక స్థానాల్లో కూడా పోటీ చేస్తోంది. ఇక మిత్ర‌ప‌క్ష‌మైన జనతాదళ్ (యూనైటెడ్) (జేడీయూ)కు  45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంకీర్ణ స‌ర్కారులో ఉన్న మ‌రోపార్టీ హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు న‌లుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తున్నారు. 

4. బీహార్ అసెంబ్లీలో ఇత‌ర పార్టీల విష‌యానికి వ‌స్తే..  రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నుండి 80 మంది ఎమ్మెల్యేలు శాస‌న స‌భ‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే,  భారత కమ్యూనిస్ట్ పార్టీ - మార్క్సిస్ట్ లెనినిస్ట్ (CPI-ML) నుండి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (CPI-M) నుండి  ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉన్నారు. 

5. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష మహాఘటబంధన్ 96 మంది ఎమ్మెల్యేలను క‌లిగి ఉంది. 

6. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 19 మంది శాసనసభ్యులు ఉండగా, ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)కి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

7. JD(U) NDAతో విడిపోయిన సందర్భంలో, కూటమి సంఖ్య 82కి పడిపోతుంది. ఈ సంద‌ర్భంలో మెజారిటీ మార్కును (96+45=140) అధిగమించి మహాఘట్‌బంధన్‌లో చేరడానికి అవకాశం ఉంటుంది. 

7. ఇప్ప‌టికే రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌పై ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఫోన్ లో మాట్లాడిన‌ట్టు వార్తాలు వినిపిస్తున్నాయి. 

8. మ‌రోవైపు నితీష్‌ కుమార్ బీజేపీతో తెగ‌తెంపులు చేసుకుంటే.. ఆయ‌న మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని ప్రతిపక్ష ఆర్జేడీ సోమవారం ప్రకటించింది. ముఖ్య‌మంత్రిగా ఆయ‌నే కొన‌సాగుతార‌ని కూడా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 

9. బీహార్‌లో శరవేగంగా మారుతున్న రాజ‌కీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ కార్యదర్శి, ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ నితీష్ కుమార్ యూనివర్సల్ లీడర్ అని అన్నారు. బీజేపీని వీడితే మాతో రండి. ఇక్క‌డ కూడా ముఖ్యంత్రిగానే ఉండండి. వారికి మా మద్దతు ఉంటుంది అని వ్యాఖ్యానించారు. 

10. బీహార్ లో ప్రస్తుతం కొన‌సాగుతున్న ప‌రిణామాలు గ‌మనిస్తే.. బీజేపీ-జేడీ(యూ) విడిపోతే.. నితీష్ కుమార్ తో క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆర్జేడీ సై అంటున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. సోనియాతో నితీష్ మాట్లాడార‌నేది అధికారికంగా ధ్రువీక‌రించ‌బ‌డితే.. రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తాజా అంశం ప‌రిస్థితులు స్ప‌ష్టంగా క‌నిపించ‌వ‌చ్చు.

11. బీజేపీపై కొంత వ‌ర‌కు ప్ర‌భావం ప‌డుతుంద‌నేది స్ప‌ష్టం. మొత్తంగా బీహార్ రాజ‌కీయాలు మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి.. చూడాలి ఏం జ‌రుగుతుందో.. ఎందుకంటే రాజ‌కీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు అని ఇప్ప‌టికే అనేక ఘ‌ట‌న‌లు నిరూపించాయి.. !

Follow Us:
Download App:
  • android
  • ios