Lifestyle

ఈ విషయాలను ఎవ్వరితోనూ చెప్పుకోకండి

ఆర్థిక పరిస్థితి

ఆర్థిక పరిస్థితి గురించి ఎవ్వరికీ చెప్పుకోకపోవడమే మంచిది. మీరెంత సంపాదిస్తున్నారు? ఎంత ఖర్చు పెడుతున్నారు వంటి వ్యక్తిగత విషయాలు పబ్లిక్ గా చెప్పుకుంటే ఇబ్బందులు పడతారు.

కుటుంబ కలహాలు

రిలేషన్ షిప్ లో కొట్లాటలు, చిన్న చిన్న గొడవలు చాలా కామన్. కానీ వీటిన్నింటినీ మీరు పబ్లిక్ లో చెప్పుకుంటే మీ రిలేషన్ షిప్స్ మరింత రిస్క్ లో పడతాయి. 

మానసిక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యం గురించి కూడా ఇతరులకు చెప్పుకోకూడదు. ఎందుకంటే దీనివల్ల మీతో ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడకపోవచ్చు. 

శరీర సౌష్టవం, అందం

మీ బాడీ ఫిట్ నెస్, అందం గురించి కూడా ఇతరుల ముందు పొగుడుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి స్వంత అందం ఉంటుంది. దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. 

అనారోగ్యం గురించి

మీకున్న వ్యాదులు, దీర్ఘకాలిక జబ్బులు వంటి మీ ఆరోగ్య పరిస్థితి గురించి ఒక్క డాక్టర్ దగ్గర తప్ప వేరే వారి దగ్గర పొరపాటున కూడా చెప్పకండి. 

పుకార్లు, గాసిప్స్

అది చిన్న విషయమే అయినా సరే.. వారి వారి గురించి పుకార్లను చెప్పకండి. ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే మీకు సమాజంలో విలువ ఉంటుంది. 

రాజకీయ అభిప్రాయాలు

నిజానికి రాయకీయాలకు కూడా దూరంగా ఉండాలి. వీటిపై చర్చ వివాదాలకు దారితీస్తుంది. ముఖ్యంగా మీ మాటకు వ్యతిరేకంగా ఉండేవారితో రాజకీయాల గురించి వాదించకండి. 

మత, ఆధ్యాత్మిక విశ్వాసాలు

దేవుడు, మతానికి సంబంధించిన విషయాలు చాలా సున్నితమైనవి. అందుకే వీటి గురించి నలుగురిలో చర్చిస్తే వివాదం అవుతుంది. 

వ్యక్తిగత జీవితం

వేరేవాళ్ల వ్యక్తిగత జీవితం గురించి మీరు వేరేవారితో మాట్లాడటం సరికాదు. ఎందుకంటే ఇది వారి ప్రైవసీని దెబ్బతీసినట్టే అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. 

హైట్ తక్కువగా ఉన్న అమ్మాయిలకు ఈ చీరలు బెస్ట్ ఆప్షన్

చాణక్య నీతి : ఈ ఐదుగురిని మాత్రం నిద్రలేపకూడదు

అసలు మూర్చ ఎందుకు వస్తుందో తెలుసా

మునగాకు రోజూ తింటే జరిగేది ఇదే