‘బ్యాన్ చేయండి లేకపోతే బర్న్ చేస్తాం’- పఠాన్ సినిమాపై థియేటర్ల యాజమాన్యాలకు హిందూ సంస్థల హెచ్చరికలు
పఠాన్ సినిమాపై వివాదం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఆ సినిమాను నిషేదించాలని, లేకపోతే సినిమా ఆడే థియేటర్లను తగులబెడుతామని హిందూ సంస్థలు హెచ్చరించాయి.

షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా మరింత వివాదంలోకి కూరుకుపోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు‘బేషరమ్ రంగ్...’ అనే మాట మాత్రమే విడుదలైంది. అయితే ఈ పాటలో హిరోయిన్ ధరించిన బట్టలపై హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. షారుక్ ఖాన్, దీపికా పడుకొణెల మధ్య చిత్రీకరించిన ఈ సాంగ్ లో హిరోయిన్ కాస్టూమ్స్ మొత్తం కాషాయ రంగులో ఉండటమే దీనికి కారణం.
ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఐదో తరగతి బాలికను విసిరేసిన టీచర్.. ఢిల్లీలో ఘటన
వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానున్న ఈ సినిమాను బ్యాన్ చేయాలని హిందూ సంస్థలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ శుక్రవారం తీవ్రరూపం దాల్చింది. పఠాన్ సినిమాను హనుమాన్ గర్హి (అయోధ్య)కి చెందిన మహంత్ రాజు దాస్ సినిమాను బహిష్కరించాలని, లేకపోతే సినిమాను ప్రదర్శించే థియేటర్ లను తగులబెట్టాలని అన్నారు.
పార్లమెంట్ మెట్లపై నుంచి జారిపడ్డ ఎంపీ శశిథరూర్.. నియోజకవర్గ పర్యటన రద్దు..
పఠాన్ చిత్రంలో సనాతన్ ధర్మాన్ని ఎగతాళి చేశారనీ, సినిమా ప్రదర్శింపబడే సినిమా హాళ్లను తగలబెట్టాలని ప్రజలను కోరినట్లు మహంత్ ఒక వీడియోలో చెప్పారని ‘ఇండియా టుడే’ నివేదించింది. “ దీపికా పదుకొణె సిగ్గులేకుండా కాషాయ రంగు బికినీ ధరించింది. ఇది సాధువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసింది. ’’ అని అన్నారు. పాటలో కాషాయపు రంగు బికినీ ధరించి ఇలాంటి స్టెప్పులు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మహంత్ ప్రశ్నించారు.
సైరస్ మిస్త్రీ మృతి కేసులో మరో కీలక విషయం వెలుగులోకి.. ఆమె సీటు బెల్ట్ సరిగా పెట్టుకోకపోవడం వల్లే..
షారుఖ్ ఖాన్ తరచూ సనాతన ధర్మాన్ని అవమానించేవాడని ఆయన ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకే జరిగిందని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. పఠాన్ ప్రదర్శనను నిలిపివేయాలని ‘హిందూ సేన’ సినిమా హౌస్‌ల యజమానులను హెచ్చరించింది. ఈ మేరకు హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు.
విజయ్ దివస్: అమర జవాన్లకు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నివాళి
‘‘పఠాన్ సినిమాపై సెన్సార్ బోర్డుకు హిందూ సేన లేఖ రాసింది. మా లేఖను పరిగణనలోకి తీసుకోకుంటే తమ సంఘం ఆధ్వర్యంలో తీవ్ర నిరసన చేపడుతాం. పఠాన్‌ను విడుదల చేస్తే నిరసనల సమయంలో కలిగే నష్టాన్ని భరించాల్సి ఉంటుందని థియేటర్ యజమానులు, పీవీఆర్ లను నేను హెచ్చరిస్తున్నాను’’ అని గుప్తా వీడియోలో బెదిరించారు.
ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
“హిందూ వ్యతిరేక చిత్రాలను సెన్సార్ చేయకుండా సినిమాలను విడుదల చేయకూడదని సెన్సార్ బోర్డుని కూడా హెచ్చరిస్తున్నాను. సెన్సార్ బోర్డ్ బాధ్యతాయుతంగా పనిచేసి సినిమాను విడుదల చేయాలి. లేకపోతే వారిపై కూడా నిరసనకు దిగుతాం’’ అని ఆయన చెప్పారు.