Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్ మెట్లపై నుంచి జారిపడ్డ ఎంపీ శశిథరూర్‌.. నియోజకవర్గ పర్యటన రద్దు..

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ  శశి థరూర్‌ కాలికి గాయమైంది. గురువారం నాడు పార్లమెంట్‌ మెట్లపై జారిపడటంతో అతని ఎడమ కాలు బెణికింది. ఈ విషయాన్ని మంత్రి శశిథరూర్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. తీవ్రమైన నొప్పి కారణంగా ప్రస్తుతం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పుతూ.. ఈ మేరకు ఫొటోలను షేర్‌ చేశారు.

Congress leader Shashi Tharoor has injured his foot after stumbling on stairs in the Parliament
Author
First Published Dec 16, 2022, 3:32 PM IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ కాలికి గాయమైంది. గురువారం నాడు పార్లమెంట్‌ భవనంలో మెట్లు దిగుతుండగా  జారిపడటంతో ఎడమ కాలు బెణికింది. ఈ విషయాన్ని మంత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తీవ్రమైన నొప్పి కారణంగా ప్రస్తుతం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పారు. తాను అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నానని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నానని తెలిపారు. ఈ మేరకు ఫొటోలను షేర్‌ చేశారు.

ఎంపీ ట్విట్టర్‌లో ఇలా రాశారు, “ ‘అసౌకర్యంగా ఉంది.నిన్న పార్లమెంటు మెట్లు దిగుతుండగా కాలు జారిపడటంతో ఎడమ కాలు బెణికింది. కొన్ని గంటలపాటు పర్వాలేదు, కానీ నొప్పి ఎక్కువైంది , వెంటనే నేను ఆసుపత్రికి వెళ్లాను. ప్రస్తుతం కదల్లేని పరిస్థితిలో ఆసుపత్రిలో ఉన్నాను. ఈరోజు పార్లమెంటుకు హాజరుకాలేకపోతున్నా. అలాగే..ఈ వారాంతలో అసెంబ్లీ నియోజకవర్గంలో జరగాల్సిన కార్యక్రమాలు కూడా రద్దు చేసుకున్నా." అని పేర్కొన్నారు. 

పోస్ట్ షేర్ చేయబడిన వెంటనే.. అతని ఫాలోవర్స్  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. “మీ ఆరోగ్యం జాగ్రత్త సార్! ఈ వయస్సులో.. మీకు ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి" అని ఒక నెటిజన్ రాసుకోచ్చారు. మరొకరు.. “అయ్యో పాపం! త్వరగా కోలుకోండి సార్!"  “ఓ ప్లీజ్ టేక్ కేర్ సర్. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని  కామెంట్ చేశారు. .


తవాంగ్ ఘటనపై కేంద్రాన్ని టార్గెట్

పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయని, సెషన్‌లో పాల్గొనేందుకు శశి థరూర్ తవాంగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రభుత్వం 'చిన్న ప్రకటన' ఇచ్చిందని, దానితో ఎలాంటి వివరణ ఇవ్వలేదని, ఇది ప్రజాస్వామ్యం కాదని థరూర్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios