దారుణం.. బహిర్భూమి కోసం వెళ్లిన 17 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారం..
మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిన నాలుగు రోజుల తరువాత.. అదే జిల్లాలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

బహిర్భూమి కోసం వెళ్లిన 17 ఏళ్ల బాలికను ఓ యువకుడు అడ్డగించాడు. నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, అలా చేస్తే చంపేస్తానని అతడు బెదిరించాడు. కానీ బాలిక ఇంటికి వచ్చిన తరువాత తన కుటుంబ సభ్యులకు ఈ దారుణాన్ని తెలియజేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
మణిపూర్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి - ఇండియా కూటమి ప్రతినిధి బృందం ఆరోపణ
వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లా రాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 17 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆమె బహిర్భూమి కోసం వెళ్లింది. అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల విజయ్ సాకేత్ బాలిక ఒంటరిగా బయటకు వెళ్లడాన్ని గమనించాడు.
వెంటనే ఆమెను వెంబడించి ఓ ప్రదేశంలో అడ్డుకున్నాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరూ చెప్పకూడదని ఆమెను బెదిరించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. కొంత సమయం తరువాత బాలిక ఇంటికి వచ్చింది. కానీ నిందితుడికి బయటపడి ఆ రోజు కుటుంబ సభ్యులకు ఏమీ చెప్పలేదు.
టమాటాలు కొనలేక ఏడ్చిన కూరగాయల వ్యాపారి.. వీడియో వైరల్.. ప్రభుత్వంపై మండిపడ్డ రాహుల్ గాంధీ..
కానీ మరుసటి రోజు తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. వెంటనే వారు రాంనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో బాధితురాలిపై అత్యాచారం, అపహరణ, బెదిరింపులకు సంబంధించి ఐపీసీ, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్టు చేశారు.
కుల్గాంలో సైనికుడి కిడ్నాప్..? ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన ఆర్మీ, పోలీసులు
నాలుగు రోజుల కిందట కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. సాత్నా జిల్లాలోని మైహర్ పట్టణంలోని ప్రముఖ ఆలయాన్ని నిర్వహిస్తున్న ట్రస్టులో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు 12 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తర్వాత ఇద్దరు నిందితులైన రవీంద్ర కుమార్, అతుల్ భడోలియాను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. నిందితులు ఇద్దరూ అక్రమ స్థలంలో ఇళ్లు నిర్మించారని పేర్కొంటూ, స్థానిక యంత్రాంగం శనివారం వారి ఇళ్లను కూల్చివేసింది.