సారాంశం

మణిపూర్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని, అందుకే రాష్ట్రంలో అంత విధ్వంసం జరుగుతోందని ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రతినిధి బృందం ఆరోపించింది. వెంటనే రాష్ట్రంలో శాంతిని పునరుద్దరించాలని డిమాండ్ చేసింది. 

మణిపూర్ లో పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రతిపక్ష ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్) కూటమికి చెందిన 21 మంది సభ్యుల ప్రతినిధి బృందం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పర్యటిస్తోంది. రెండు రోజుల పర్యటన శనివారం ప్రారంభమైంది. మొదటి రోజు ప్రతిపక్ష ఎంపీల బృందం పలు సహాయ శిబిరాలను సందర్శించి, జాతి ఘర్షణల బాధితులను పరామర్శించింది. ఈ సందర్భంగా ఎంపీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శించారు.

టమాటాలు కొనలేక ఏడ్చిన కూరగాయల వ్యాపారి.. వీడియో వైరల్.. ప్రభుత్వంపై మండిపడ్డ రాహుల్ గాంధీ..

బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం కలహాలు మరింత ముదిరేందుకు అనుమతించిందని ఆరోపించారు. వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించాలని కోరారు. మణిపూర్ పర్యటనలో ఉన్న ఇండియా కూటమి ప్రతినిధి బృందంలో ఒకరైన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ.. మణిపూర్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించాలని కోరారు. సామరస్యం, న్యాయాన్ని కాపాడుకోవడం చాలా అవసరం అని అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు గవర్నర్ అన్ని ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. 

తృణమూల్ ఎంపీ సుస్మితా దేవ్ మీడియాతో మాట్లాడుతూ,..‘‘ఇక్కడ (మణిపూర్) పరిస్థితి బాగా లేదు. మేము గవర్నర్ కు ఉమ్మడి వినతిపత్రాన్ని సమర్పించాలనుకుంటున్నాము. శాంతిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం. రాష్ట్రంలో పరిస్థితిని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేయాలని గవర్నర్ ను కోరుతాం’’ అని అన్నారు. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించాలని గవర్నర్ ను కోరనున్నట్లు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తెలిపారు. గవర్నర్ కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. 

కుల్గాంలో సైనికుడి కిడ్నాప్..? ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన ఆర్మీ, పోలీసులు

కాగా.. మణిపూర్ ను సందర్శిస్తున్న ప్రతిపక్ష ఎంపీలలో అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్ లతో పాటు టీఎంసీ నుంచి సుస్మితా దేవ్, జేఎంఎం నుంచి మహువా మాజి, డీఎంకే నుంచి కనిమొళి, ఆర్ ఎల్ డీ నుంచి జయంత్ చౌదరి, ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా, ఆర్ ఎస్ పీ నుంచి ఎన్ కే ప్రేమచంద్రన్, జేడీయూ చీఫ్ రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్, అనీల్ ప్రసాద్ హెగ్డే (జేడీయూ), సీపీఐ నుంచి పీ సందేశ్ కుమార్, సీపీఎం నుంచి ఏ.ఎ. రహీమ్ తో పాటు పలువురు ఉన్నారు.