Anil Ambani ED Probe: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట హాజరయ్యారు 

Anil Ambani ED Probe: మనీలాండరింగ్‌ కేసులో రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ (Anil Ambani) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయన వాంగ్మూలాన్ని ఈడీ నమోదుచేయనుంది. ఆయన విదేశాలకు పారిపోకుండా లుకౌట్‌ సర్క్యులర్‌ను కూడా జారీ అయ్యింది. 

రూ.17వేల కోట్ల రుణ మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ప్రశ్నించేందుకు ఇటీవల దర్యాప్తు సంస్థ ఆయనకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే అనిల్ అంబానీ విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు లుకౌట్ సర్క్యులర్ కూడా అధికారులు జారీ చేసినట్టు సమాచారం. ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగు చూసే అవకాశముంది.