Shloka Ambani Vs Radhika Ambani: అంబానీ ఇద్దరు కోడళ్లలో ఎవరు ఎక్కువ రిచ్..?
అంబానీ ఇంట ప్రస్తుతం ఇద్దరు కోడళ్లు అడుగుపెట్టారు. ముకేష్ అంబానీ ఇంటి కోడళ్లు కాబట్టి.. వారికి డబ్బుకి కొరత ఉండదు ఈ విషయం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.

అంబానీ కోడళ్లు...
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ దేశంలోనే అతి పెద్ద బిలీనియర్ . కాగా, ముకేష్ అంబానీ కి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ. వారిద్దరికీ పెళ్లిళ్లు కూడా జరిగాయి. గతేడాదే చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం మాత్రం చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
అంబానీ ఇంట ప్రస్తుతం ఇద్దరు కోడళ్లు అడుగుపెట్టారు. ముకేష్ అంబానీ ఇంటి కోడళ్లు కాబట్టి.. వారికి డబ్బుకి కొరత ఉండదు ఈ విషయం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. మరి, ఈ ఇద్దరు కోడళ్లలో ఎవరు ఎక్కువ రిచ్ ..? వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటి? ప్రస్తుతం వాళ్లు ఏం చేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
రాధిక మర్చంట్ బ్యాగ్రౌండ్...
చిన్న కోడలు రాధిక మర్చంట్ ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేంద్ర మర్చంట్ కుమార్తె. ఎకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత రాధిక ముంబయి లోని బీడి సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ బ్యాచిలర్ బిడి సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ బ్యాచిలర్ డిప్లొమా పొందారు. దీని తర్వాత , ఆమె న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ చదివారు.
శ్లోకా మెహతా బ్యాగ్రౌండ్..
ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె. ఆమె 2019లో ఆకాష్ అంబానీని వివాహం చేసుకుంది. శ్లోకా న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. దీని తర్వాత, ఆమె తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ 2014లో కుటుంబ వ్యాపారం రోజీ బ్లూ డైమండ్స్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది. న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుండి న్యాయశాస్త్రం పూర్తి చేసింది.
మెహతా కుటుంబం – (ఆకాష్ అంబానీ భార్య: శ్లోకా మెహతా)
వ్యాపారం: వజ్రాల వ్యాపారం.
కంపెనీ పేరు: రోజీ బ్లూ ఇండియా.
ముఖ్యుడు: రస్సెల్ మెహతా.
సంపద: రూ. 1,844 కోట్లు.
2022 ఆదాయం: రూ. 5,599 కోట్లు.
వజ్రాల పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కంపెనీ ఇది. శ్లోకా మెహతా కుటుంబం దాతృత్వ కార్యక్రమాలనూ నడుపుతోంది.
మర్చంట్ కుటుంబం – (అనంత్ అంబానీ భర్త: రాధిక మర్చంట్)
వ్యాపారం: ఔషధ తయారీ.
కంపెనీ పేరు: ఎన్‌కోర్ హెల్త్‌కేర్.
అధ్యక్షుడు: విరేన్ మర్చంట్.
సంపద: రూ. 755 కోట్లు.
కంపెనీ విలువ: రూ. 2,000 కోట్లు.
ఈ కంపెనీ ఔషధ ఉత్పత్తుల తయారీలో ప్రత్యేకత కలిగి ఉంది. రాధిక మర్చంట్, ఆమె తల్లి శైలా మర్చంట్, అక్క అంజలి కూడా సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.