న్యూఢిల్లీ:   హిందీ విషయంలో  కేంద్రం వెనక్కు తగ్గింది. జాతీయ విద్య విధానం డ్రాఫ్ట్ పాలసీలో కేంద్రం మార్పులు చేర్పులు చేసింది. హిందీ బలవంతంగా రుద్దడాన్ని కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో డ్రాఫ్ట్ పాలసీలో మార్పులు చేర్పులు చేసింది కేంద్రం.

 హిందీ, ఇంగ్లీష్‌తో ఆయా రాష్ట్రాల్లోని ప్రజల మాతృభాషను ఉంటుందని  జాతీయ నూతన విద్య పాలసీ 2019 లో కేంద్రం సిఫారసు చేసింది. కానీ,ఈ విధానంపై ఆయా రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత  వచ్చింది. దీంతో సోమవారం నాడు డ్రాఫ్ట్ పాలసీలో మార్పులు చేర్పులు చేసింది.

గ్రేడ్ 6 లేదా గ్రేడ్ 7 చదివే విద్యార్థులు ఒకటి లేదా మూడు భాషల్లో మార్పులు చేసుకోవచ్చని కూడ మార్పులు చేసింది. తమ ఇష్టం వచ్చిన మూడు భాషలను ఎంచుకోవచ్చని కేంద్రం పేర్కొంది.జాతీయ విద్య పాలసీ 2019లో హిందీని తప్పనిసరి చేయడంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

బలవంతంగా హిందీని అమలు చేయడాన్ని తమిళనాడులో పార్టీలకు అతీతంగా నేతలు వ్యతిరేకించారు.కర్ణాటక సీఎం కుమారస్వామి హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించారు.