Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు అన్ని హ‌క్కులు క‌ల్పించాలి - సుప్రీంకోర్టు

సెక్స్ వర్కర్లకు అన్ని హక్కులు కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దేశంలో పౌరులందరూ సమానమేనని, అందరికీ  ఉన్న ప్రాథమిక హక్కులు వీరికి వర్తిస్తాయని చెప్పింది. 

All rights reserved for sex workers - Supreme Court
Author
Hyderabad, First Published Dec 14, 2021, 8:43 PM IST

సాధార‌ణ పౌరుల‌కు క‌ల్పించిన విధంగానే సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు అన్ని హ‌క్కులు క‌ల్పించాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. క‌రోనా వైర‌స్, లాక్ డౌన్ ల వల్ల సెక్స్ వ‌ర్క‌ర్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నార‌ని, వారికి ప్ర‌భుత్వం సాయం చేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ మంగ‌ళ‌వారం ధ‌ర్మాస‌నం ముందుకు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. దేశంలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కులు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది. వారికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు జారీ చేసే అన్ని ర‌కాల కార్డుల‌ను ఇవ్వాల‌ని చెప్పింది. భార‌తదేశంలో అంద‌రికీ స‌మాన హ‌క్కులు క‌ల్పించ‌బ‌డ్డాయ‌ని తెలిపింది.  సెక్స్ వర్కర్లకు సరుకులు అందజేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. వారికి అన్ని రకాల కార్డులు అందజేయాలని పదేళ్ల క్రితమే సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తించేసింది. కానీ ఇప్ప‌టికీ ఆ తీర్పును అమ‌లు చేయ‌డం లేద‌ని పేర్కొంది. ఆయా ర‌కాల కార్డులు జారీ చేసే ప్ర‌క్రియ మొద‌లుపెట్టాల‌ని ఆదేశించింది. ఈ ప్ర‌క్రియ‌లో వారి గోప్య‌త‌కు భంగం క‌ల్గకుండా చూడాల‌ని చెప్పింది. 

తేజస్వీ యాదవ్ పెళ్లిపై దుమారం : పేరు మార్చుకున్న లాలూ కొత్త కోడలు.. ఏంటంటే..?

క‌రోనా స‌య‌మంలో ఇబ్బందుల్లోకి..
సెక్స్ వ‌ర్క‌ర్లకు స‌మాజంలో గుర్తింపు  ఉండ‌దు. అంద‌రూ వారిని చుల‌క‌న‌గా చూస్తారు. ఎవ‌రు ఏమ‌నుకున్నా వారి పొట్ట‌కూటి కోసం ఆ వృత్తినే కొన‌సాగిస్తున్న సెక్స్ వ‌ర్క‌ర్ల జీవితాలు క‌రోనా, లాక్‌డౌన్ స‌మ‌యంలో ఒక్క సారిగా మారిపోయాయి. క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలో వారి ఉపాధికి గండిప‌డింది. నిజానికి క‌రోనా వ‌ల్ల చాలా రంగాల్లో ఉద్యోగాలు పోయాయి. అన్ని రంగాలు ఆర్థికంగా దెబ్బ‌తిన్నాయి. చాలా మంది జీవితాలు రోడ్డున ప‌డ్డాయి. అలాగే  సెక్స్ వ‌ర్క‌ర్లు జీవితాలు కూడా. అయితే మిగితా వారంద‌రూ ఎలాగోలా నెట్టుకొచ్చినా.. సెక్స్ వ‌ర్కర్ల‌కు మాత్రం ప్ర‌తీ చోటా అవ‌మానాలే ఎదుర‌య్యాయి. లాక్ డౌన్ స‌మ‌యంలో ఎవ‌రినీ సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను దరిచేర‌నీయ‌లేదు. ఎక్క‌డి నుంచే వ‌చ్చి సెక్స్ వ‌ర్క‌ర్లుగా మారిన వారు తిరిగి వారి స్వ‌స్థ‌లాల‌కు చేరుకోలేక‌పోయారు. కొంద‌రు ధైర్యం చేసి వారి సొంత  ఇళ్ల‌కు వెళ్లినా.. వారి కుటుంబ స‌భ్యులు స‌మాజం ఏమ‌నుకుంటుదోన‌ని వారిని ఇంటికి రానివ్వ‌లేదు. దీంతో వారి జీవితం అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది. ప్ర‌భుత్వం నుంచి వారికి గుర్తింపు కూడా లేక‌పోవ‌డంతో వారికి సాయం ద‌క్క‌లేదు. ప్ర‌జ‌లంద‌రికీ రేష‌న్ స‌రుకులు, ఇత‌ర ర‌కాల సాయం ప్ర‌భుత్వం చేసిన‌ప్ప‌టికీ వీరికి ఎలాంటి గుర్తింపు కార్డులు లేక‌పోవ‌డం వ‌ల్ల వీరికి ఏ సాయం అంద‌లేదు. దీంతో చాలా ఇబ్బందులు ప‌డ్డారు. ఇప్పుడు ఆదేశాల వ‌ల్ల వారికి గుర్తింపు కార్డులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. సాధార‌ణ పౌరుల‌కు ద‌క్కే అన్ని హ‌క్కులు వీరికి కూడా వ‌ర్తించనున్నాయి. ఈ కార్డులు జారీ చేయ‌డం వ‌ల్ల ఓటు హ‌క్కు, రేష‌న్ పొందే హక్కు వంటివ‌న్నీ ద‌క్కనున్నాయి. ఓటు హ‌క్కు వ‌స్తే రాజ‌కీయ నాయ‌కులు వీరి కోసం ప్ర‌త్యేకంగా ప‌థ‌కాలు కూడా రూపొందించే అవ‌కాశం లేక‌పోలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios