బదోహి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ ఘటన పునరావృతమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదోహి జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన గురువారంనాడు జరిగింది. 14 ఏళ్ల బాలిక శవమై తేలింది. పొలాల్లోకి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు.

దాంతో ఆమె సోదరుడు గాలింపు చేపట్టాడు. పొలాల్లో ఆమె శవం కనిపించింది. ఆమె తలపై ఇటుకలతో మోదినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక కోసం చూస్తున్నట్లు పోలీసు సూపరింటిండెంట్ రామ్ బదన్ సింగ్ చెప్పారు. 

Also Read: బాధితురాలిపై రేప్ జరగలేదు, దానివల్లే మృతి: హత్రాస్ ఘటనపై ఏడీజీ ప్రశాంత్

గోపిగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని చక్రజరామ్ తివారీపూర్ గ్రామానికి చెందిన బాలికగా ఆమెను గుర్తించారు. లైంగిక దాడి చేసిన తర్వాత ఆమెను చంపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సాక్ష్యాలను సేకరించడానికి ఫోరెన్సిక్ నిపుణులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆ గ్రామానికి చేరుకున్నారు. 19 ఏల్ల దళిత బాలికను దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపిన ఘటన తర్వాత అంతే ఘోరంగా తాజా సంఘటన జరిగింది. హత్రాస్ బాలికపై అత్యాచారం జరలేదని పోలీసులు చెప్పారు.  

Also Read: నన్ను.. తోసేసి లాఠీఛార్జీ చేశారు: పోలీసుల తీరుపై రాహుల్ ఫైర్

హత్రాస్ ఘటన తీవ్రమైన ఆందోళనకు దారి తీసిన విషయం తెలిసిందే. హత్రాస్ ఘటన తర్వాత బాలికలపై పరుసగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతూ వచ్చాయి.