పెళ్లికి నిరాకరించిందని.. ఒంటరిగా ఇంట్లో ఉన్న 12వ తరగతి బాలిక ఇంట్లోకి ప్రవేశించి, దారుణానికి పాల్పడిన యువకుడు
పెళ్లి ప్రతిపాదనను తిరస్కరిస్తోందని ఓ యువకుడు 12వ తరగతి చదివే బాలికపై కక్ష పెంచుకున్నాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో చూసి లోపలికి ప్రవేశించాడు. అనంతరం బాలికను దారుణంగా హతమార్చాడు.

ఆ బాలిక 12వ తరగతి చదువుతోంది. కొంత కాలం కిందట ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వారిద్దరూ స్నేహితులుగా మారారు. ఈ స్నేహాన్ని ఆ యువకుడు తప్పుగా భావించాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెకు ప్రతిపాదన పెట్టాడు. కానీ ఆమె దానికి నిరాకరించింది. ఇలా పలుమార్లు వెంటబడ్డాడు. కానీ దానికి బాలిక ఒప్పుకోలేదు. దీంతో కోపంతో ఆ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
బాధితురాలి తండ్రి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంచీ సిటీలోని బెరో పోలీస్ స్టేషన్ లో పరిధిలో సురేష్ ఖాఖా, దినియా ఖాఖా అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి ఖుష్బూ అనే కూతురు ఉంది. ఆమె ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. కొంత కాలం కిందట ఆమెకు అర్జున్ ఒరాన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడు వృత్తిరీత్యా డ్రైవర్. వారి మధ్య కొంత కాలం పాటు స్నేహం కొనసాగింది.
గర్భిణిని బంధించి రూ.10 లక్షలు చోరీ చేసిన దొంగ.. జైలుకు వెళ్లి వచ్చి, డిప్రెషన్ తో ఆత్మహత్య..
దీనిని ఆసరాగా తీసుకున్న అర్జున్ ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని ఖుష్బూకు తెలిపాడు. కానీ ఆమె దానికి నిరాకరించింది. అయినా కూడా అతడు ఆమెను వదలలేదు. పలుమార్లు వెంటపడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. కానీ దానికి ఆమె అంగీకరించడం లేదు. ఈ క్రమంలో గురువారం బాలిక తండ్రి బయటకు వెళ్లాడు. తల్లి కూడా ఇంట్లో లేదు. బాలిక ఒంటరిగా ఉంది. దీనిని గమనించిన అర్జున్ సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించాడు.
బాలికపై కత్తితో 8 సార్లు దాడి చేశాడు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) కు తరలించారు. ఈ ఘటనపై బాధితురాలు తల్లి దినియా ఖాఖా బెరో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఐదో తరగతి బాలికపై సోదరుడి అత్యాచారం.. ఎవరికీ తెలియకూడదని మరో ఇద్దరితోనూ కలిసి..
కాగా.. ఖష్బూ రిమ్స్ లో చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో శుక్రవారం మరణించింది. అయితే ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. నిందితుడు అర్జున్ ఒరాన్ ను అరెస్టు చేశారు. రక్తపు మరకలు ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరపుతున్నామని రూరల్ ఎస్పీ నౌషాద్ ఆలం తెలిపారు.