గర్భిణిని బంధించి రూ.10 లక్షలు చోరీ చేసిన దొంగ.. జైలుకు వెళ్లి వచ్చి, డిప్రెషన్ తో ఆత్మహత్య..
ఓ యువకుడు రెండు నెలల కిందట గర్బిణి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. రూ.10 లక్షలు చోరీ చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అనంతరం అతడు బెయిల్ పై బయటకు వచ్చాడు. డిప్రెషన్ తో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అతడు గతంలో ఓ బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ సంస్థలో పనిచేశాడు. కానీ తరువాత ఏమైందో ఏమో గానీ అందులో ఉద్యోగం మానేశాడు. అయితే ఈ ఏడాది మేలో ఓ గర్భిణీ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు. ఆమెను బంధించి రూ.10 లక్షలు దోపిడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఆ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. జైలుకు వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చాడు. కానీ ఇంటికి వచ్చిన తరువాత డిప్రెషన్ తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని సికింద్రాబాద్ రెజిమెంటల్ లో చోటు చేసుకుంది.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో 27 ఏళ్ల మోతీ రామ్ రాజేష్ యాదవ్ నివాసం ఉండేవాడు. అతడు మే నెల 12వ తేదీన లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. తెల్లవారుజామున 4 గంటలకు నిచ్చెన సాయంతో లోపలికి వెళ్లాడు. ఆ ఇంట్లో నవ్య అనే గర్భిణీ ఉంది. ఆమె పడక గదిలోకి ప్రవేశించాడు.
రైల్వేస్టేషన్ లో స్థంభాల మధ్య తల పెట్టిన 18 చిన్నారి.. గంటన్నరపాటు నరకయాతన.. కాపాడిన రైల్వే సిబ్బంది
ఆమెను కొన్ని గంటల పాటు బందీగా ఉంచి రూ.10 లక్షలు చోరీ చేశాడు. అనంతరం ఇంట్లో నుంచి బయటపడ్డాడు. తరువాత క్యాబ్ బుక్ చేసుకుని షాద్ నగర్ వెళ్లి, అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ దొంగతనంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. రెండు వారాల తర్వాత నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం దోపిడీ కేసులో జైలుకు వెళ్లిన రాజేష్.. జూన్ 30న బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే అప్పటి నుంచి నిరుద్యోగిగా ఉంటున్నాడు.
ఐదో తరగతి బాలికపై సోదరుడి అత్యాచారం.. ఎవరికీ తెలియకూడదని మరో ఇద్దరితోనూ కలిసి..
జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అతడు డిప్రెషన్ లో ఉన్నాడు. ఒంటరిగానే ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ఎలాంటి సూసైడ్ నోటూ రాయలేదు. కాగా.. మోతీ రామ్ రాజేష్ యాదవ్ గతంలో ఓ బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ సంస్థలో పనిచేశాడు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.