Asianet News TeluguAsianet News Telugu

ఐదో తరగతి బాలికపై సోదరుడి అత్యాచారం.. ఎవరికీ తెలియకూడదని మరో ఇద్దరితోనూ కలిసి..

సోదరుడి వరుసయ్యే ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం మరో ఇద్దరికి తెలిసింది. వారు కూడా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇందులో ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడు. 

Rape of fifth class girl by brother. Gang rape along with two others..ISR
Author
First Published Jul 22, 2023, 8:32 AM IST

ఆ బాలిక ఐదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు చేపల చెరువుకు కాపలా ఉంటూ జీవనం సాగిస్తారు. దీంతో ఆమె ఓ గవర్నమెంట్ హాస్టల్ లో ఉంటూ పాఠశాలకు వెళ్తుంది. అక్కడ ఆ బాలిక కుటుంబానికి బంధువులు ఉన్నారు. ఆమెకు వారు అండగా ఉంటారని ఆ తల్లిదండ్రులు కూడా నిశ్చింతగా ఉన్నారు. కానీ ఆ బంధువుల కుటుంబంలోని సోదరుడి వరుసయ్యే ఓ యువకుడే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని మరో ఇద్దరు గమనించారు. వారు ఈ విషయం ఎక్కడ బయటకు చెబుతారనే భయంతో వారితోనూ ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడేలా చేశాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు చేపల చెరువుకు కాపలా ఉంటారు. తమ కూతురును ఏలూరు జిల్లాలోని ఓ గ్రామంలోని గవర్నమెంట్ హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నారు. ఆ హాస్టల్ ఉన్న గ్రామంలోనే ఆ కుటంబానికి బంధువులు ఉంటారు. దీంతో వారు తమ బిడ్డను చూసుకుంటారని ధీమాతో ఉన్నారు. బాలిక ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది.

ఆ బంధువుల కుటుంబంలో 19 ఏళ్ల రాంబాబు ఆ బాలికకు వరసకు సోదరుడు. అయితే కొన్ని నెలల కిందట నుంచి ఆ బాలికను అతడు తన అద్దె ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఇంటి  ఓనర్ ఫ్రెండ్ అయిన 45 ఏళ్ల షేక్ ఖాదర్ అనే వ్యక్తికి తెలిసిపోయింది. కానీ అతడు నిందితుడిని మందలించలేదు. ఇదేం పని అని నిలదీయలేదు. అతడు కూడా రాంబాబుతో కలిసి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ దారుణాన్ని ఆ ఇంటి ఓనర్ కుమారుడు గమనించాడు. ఆ బాలుడికి 13 ఏళ్లు. అయితే ఈ దారుణాన్ని ఎవరికైనా చెబితే ఇదంతా భయటపడిపోతుందనే భయంతో నిందితులు ఇద్దరూ ఆ బాలుడికి బ్లూ ఫిల్మ్స్ చూపించారు. ఆ బాలుడిని కూడా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టేలా ప్రోత్సహించారు. ఇలా ఈ ముగ్గురూ కలిసి నాలుగు నెలల పాటు బాలికపై అత్యాచారం చేశారు. అయితే బాధితురాలు అనారోగ్యంగా ఉండటాన్ని ఆ హాస్టల్ వార్డెన్ గుర్తించారు. ఏం జరిగిందని ఆరా తీశారు. కానీ బాలిక ఏం చెప్పలేకపోతోంది. ఇదే సమయంలో అటు నుంచి బాలికను తన వెంట తీసుకెళ్లేందుకు రాంబాబు అక్కడికి వచ్చాడు. 

అతడిని చూసిన బాధితురాలు భయాందోళనకు గురైంది. ఒక్క సారిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. దీంతో ఆ వార్డెన్ కు విషయం అర్థమైంది. ఏమైందని బాలికను గట్టిగా అడిగారు. దీంతో ఆమె వణికిపోతూ తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏలూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు ఆ హాస్టల్ వార్డెన్ సంప్రదించారు. ఆమె నుంచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారందరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios