Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ సినిమా నుంచి ప్రేర‌ణ పొంది.. విక‌లాంగ యువకుడిని హతమార్చిన మైన‌ర్

సినిమాల ప్రభావం పిల్లలపై ఎంతగా ఉందో చెప్పే ఘటన ఇది. ఓ బాలీవుడ్ సినిమాను చూసి స్ఫూర్తి పొందిన మైనర్.. ఓ వికలాంగుడిని హత్య చేశాడు. ఆ సినిమాలో చూపించిన విధంగా గ్లౌజ్ ను అక్కడ వదిలేసి పరారయ్యాడు. 

A minor who got inspiration from a Bollywood movie and killed a disabled youth
Author
First Published Sep 2, 2022, 2:21 PM IST

బాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన 17 ఏళ్ల బాలుడు ఓ వికలాంగ యువ‌కుడిని హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిని దక్షిణ ఢిల్లీలో శుక్రవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

పన్నీరు సెల్వంకు షాకిచ్చిన‌ హైకోర్టు .. పార్టీ పగ్గాలు పళనిస్వామికే

ఓ ఇంట్లో విక‌లాంగ బాలుడు త‌న సోద‌రి, త‌ల్లిదండ్రులు, అమ్మ‌మ్మ, తాత‌య్యలు క‌లిసి జీవిస్తున్నాడు. అయితే వీరి ఇంట్లో ఓ మైన‌ర్ కొన్ని నెల‌ల నుంచి ప‌ని చేస్తూ విక‌లాంగ యువ‌కుడికి స‌హాయంగా ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో ఒక రోజు కుటుంబ సభ్యులు అంతా దేవాల‌యానికి వెళ్లారు. విక‌లాంగుడి సోద‌రి కూడా ఆ మైన‌ర్ ను అత‌డి వ‌ద్ద వదిలేసి గ్రీన్ పార్క్ మార్కెట్ కు వెళ్లింది. 

షాకింగ్‌.. ఒకే నెలలో 23.87లక్షల భారతీయ వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం.. కారణం ఏంటంటే..!

ఇదే మంచి స‌మ‌యం అని భావించిన మైన‌ర్ ఇంట్లో దొంగ త‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దీనిని గ‌మ‌నించిన విక‌లాంగుడు అలారం మోగించేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఆ మైన‌ర్ అత‌డిని చంపాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. బాలీవుడ్ సినిమా ‘తూ చోర్ మెయిన్ సిపాహి’ నుంచి స్ఫూర్తి పొంది వికలాంగుడిని హత్య చేశాడు. ఆ సినిమాలో చూపించిన విధంగా బ్లాక్ కలర్ గ్లౌజ్‌ని అక్కడే వ‌దిలేసి వెళ్లిపోయాడు.

నెలల తరబడి జీతం ఇవ్వ‌కపోవ‌డంతో.. విషం తాగిన 7 గురు కార్మికులు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఘ‌ట‌న

అయితే వికలాంగుడి సోద‌రి తిరిగి వ‌చ్చిన‌ప్పుడు అతడు మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అలాగే మైనర్ బాలుడు కూడా ఇంట్లో క‌నిపించ‌లేదు. ఇంట్లో వెత‌క‌గా కొన్ని న‌గ‌లు, ఒక మొబైల్ ఫోన్, సుమారు రూ.40 వేల నగదు కూడా మాయమైనట్లు గుర్తించారు. ఈ విష‌యంలో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగారు. 

ఎమ్మెల్యేను కొట్టిన భర్త.. ఆలస్యంగా వెలుగులోకి... వీడియో వైరల్..

నిందితుడైన మైన‌ర్ బాలుడు బీహార్‌లోని తన స్వగ్రామానికి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పోలీసులు అత‌డిని ప‌ట్టుకున్నారు. క్లీనింగ్‌ పనులు చేయడం అవమానకరంగా భావించిన బాలుడు ఇంట్లో నుంచి వెళ్లిపోవాల‌ని అనుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు. అయితే బ‌య‌ట‌కు వెళ్లి బ‌త‌కాలంటే, డ‌బ్బులు సంపాదించాలంటే దొంగ‌త‌నం చేయాల‌ని నిర్ణ‌యించుకొని, ఈ చోరీకి పాల్ప‌డ్డాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios