MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Free Train : రైల్వే గుడ్ న్యూస్... వీరికి వందే భారత్ సహా అన్ని రైళ్లలో ప్రయాణం ఉచితమే...!

Free Train : రైల్వే గుడ్ న్యూస్... వీరికి వందే భారత్ సహా అన్ని రైళ్లలో ప్రయాణం ఉచితమే...!

Free Train : భారత రైల్వే సంస్థ శుభవార్త తెలియజేసింది. మన దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే సైనికులు, వీరయోధులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారికి అన్ని రైళ్లల్లోనూ ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని ఇచ్చింది.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 28 2026, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
ఉచిత రైల్వే ప్రయాణం.. ఎవరికి?
Image Credit : Gemini AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

ఉచిత రైల్వే ప్రయాణం.. ఎవరికి?

మన దేశంలో లగ్జరీ రైలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వందే భారత్ ఎక్స్ ప్రెస్. ఇలాంటి రైలులో కొందరికి భారత రైల్వే ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని ఇచ్చింది. దేశం కోసం ప్రాణాలకు తెగించిన మన వీరయోధులకు మాత్రం ఇకపై వందే భారత్ సహా అన్ని రైళ్లలోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం దక్కనుంది. శౌర్య పురస్కారాలు అందుకున్న ‘చక్ర’ సిరీస్ అవార్డు గ్రహీతలకు ఈ బంపర్ సదుపాయాన్ని కల్పిస్తూ.. రైల్వే, రక్షణ మంత్రిత్వ శాఖలు గుడ్ న్యూస్ తెలియజేశాయి.

వందే భారత్ లోనూ ఉచిత ప్రయాణం...

గతంలో సాధారణ రైళ్లలో ఈ ఉచిత ప్రయాణం చేయడానికి వీలు ఉండేది. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లతో సహా దేశంలోని అన్ని రైళ్లకు విస్తరించారు. ఈ సదుపాయాన్ని అప్ గ్రేడ్ చేసినా, అవార్డు గ్రహీతలకు గతంలో ఉన్న అర్హతలు, ప్రయాణ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
అసలు ఏం మారింది? పాత రూల్స్ ఏంటి?
Image Credit : Gemini AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

అసలు ఏం మారింది? పాత రూల్స్ ఏంటి?

చక్ర సిరీస్ అవార్డు గ్రహీతలకు జీవితాంతం ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం 1996 నుంచే అమల్లో ఉంది.

గతంలో వీరు తమ కాంప్లిమెంటరీ కార్డ్ పాస్‌లతో సహచరుడితో కలిసి ప్రయాణించే వీలు ఉండేది, అలాగే 2012–2014 మధ్య కాలంలో క్యాటగిరీలను బట్టి ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, రాజధాని/శతాబ్ది/దురంతో వంటి రైళ్లలోనూ వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు వందే భారత్‌తో సహా అన్ని రైళ్లకు ఈ పాస్‌ను వర్తింపజేయడం విశేషం. అయితే గతంలో ఉన్న క్లాస్ అర్హతలు, నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

దేశ యోధుల ధైర్యం, త్యాగం, సేవలను గౌరవించడంలో రైల్వే, రక్షణ మంత్రిత్వ శాఖల ఉమ్మడి నిబద్ధతను ఈ నిర్ణయం చాటి చెబుతోంది అంటూ.. ఇండియన్ ఆర్మీ.. ట్విట్టర్ (ఎక్స్) లో పేర్కొన్నారు.

ఈ ఉచిత ప్రయాణ సదుపాయం ఎవరికి దక్కుతుంది..?

స్వాతంత్ర్యం తర్వాత జనవరి 26, 1950న తొలిసారి పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర పురస్కారాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరికొన్ని అవార్డులను చేర్చారు. అవి ఇవే.. పరమవీర చక్ర (Param Vir Chakra)

అశోక చక్ర (Ashoka Chakra)

మహావీర చక్ర (Mahavir Chakra)

కీర్తి చక్ర (Kirti Chakra)

వీర చక్ర (Vir Chakra)

శౌర్య చక్ర (Shaurya Chakra)

ఈ అవార్డుల ప్రత్యేకత..

చక్ర సిరీస్‌లోని ఆరు పురస్కారాలు వేర్వేరు సందర్భాల్లో చూపే ధైర్యానికి గుర్తింపుగా ఇస్తారు:

యుద్ధ సమయంలో శౌర్యానికి: పరమవీర చక్ర (PVC), మహావీర చక్ర (MVC), వీర చక్ర (Vir Chakra).

శాంతికాలంలో (కౌంటర్-టెర్రరిజం, ఇతర ఆపరేషన్లలో) సాహసానికి: అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర.

2026 మార్చిలో సైనిక, నౌకా, వాయుసేన శౌర్య పతకాల గ్రహీతలకు కూడా జీవితాంతం ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాన్ని (ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, ఏసీ చైర్ కార్‌లో సహచరుడితో పాటు, IRCCP పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్‌తో) ప్రభుత్వం విస్తరించింది. ఇప్పుడు చక్ర సిరీస్ అవార్డు గ్రహీతలకు కూడా అన్ని రైళ్లలో వందే భారత్ సహా సదుపాయం అందడం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ప్రయాణం
భారత దేశం
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
PM Modi: మహిళా రిజర్వేషన్ల అమలుపై మోదీ కీలక వ్యాఖ్యలు.. త‌గ్గేదే లేదంటూ
Recommended image2
Delimitation Bill: డీలిమిటేషన్‌తో మారనున్న పొలిటికల్ మ్యాప్.. ఏపీ, తెలంగాణ సీట్ల లెక్కలు ఇవే
Recommended image3
Holidays: 2027 ప్రభుత్వ సెలవుల లిస్ట్ వచ్చేసింది.. ఈసారి ఏకంగా 4 లాంగ్ వీకెండ్స్ పండగే
Related Stories
Recommended image1
Oldest Village: మన దేశంలో అత్యంత పురాతన గ్రామం... పాండవులు తిరిగిన నేల ఇది..!
Recommended image2
Chickpeas: ప్రెజర్ కుక్కర్ లేకపోయినా.. శనగలను మెత్తగా ఉడికించే చిట్కాలు ఇవి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved