Asianet News TeluguAsianet News Telugu

నెలల తరబడి జీతం ఇవ్వ‌కపోవ‌డంతో.. విషం తాగిన 7 గురు కార్మికులు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఘ‌ట‌న

గత కొన్ని నెలలుగా ఆ కార్మికులకు జీతాలు అందలేదు. పైగా వారిని ఇతర చోట్లకు బదిలీ చేశారు. ఈ పరిణామాలపై ఆందోళన చెందిన కార్మికులు ఫాక్టరీలోనే ఆత్మహత్యకు యత్నించారు. 

7 workers poisoned after not being paid for months.. Incident in Madhya Pradesh
Author
First Published Sep 2, 2022, 12:26 PM IST

ఏడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఏడుగురు ఉద్యోగులు విషం తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో రాష్ట్రంలో చోటు చేసుకుంది. స్థానికులు వీరింద‌రినీ హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారంతా హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని అధికారులు తెలిపారు.

కాలిన‌డ‌క‌న వెళ్తున్న భ‌క్తుల పైకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి.. మ‌రికొంద‌రి ప‌రిస్థితి విష‌మం..

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఇండోర్‌లోని పరదేశిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్యాబ్రికేషన్, మాడ్యులర్ కిచెన్‌లను త‌యారు చేసే ఫ్యాక్ట‌రీ ఉంది. అయితే ఇందులో ప‌లువురు కార్మికులు ప‌ని చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ గ‌త 8 నెల‌ల నుంచి స‌రిగా న‌డ‌వడంలేదు. దీంతో కొన్ని నెలల నుంచి కార్మికుల‌కు జీతాలు స‌రిగా అంద‌డం లేదు. దీంతో ఇందులో ప‌ని చేసే 7 గురు కార్మికుల‌ను మేనేజ‌ర్ సాన్‌వెర్‌ రోడ్డులో ఉన్న కంపెనీకి బదిలీ చేశారు.

భోపాల్‌లో నాలుగు హత్యల పాల్పడిన సీరియల్ కిల్లర్.. అప్రమత్తమైన పోలీసులు.. రూ. 30 వేల రివార్డు ప్రకటన

అయితే ఆ కార్మికులంతా పాత కంపెనీ వద్ద‌కు చేరుకొని ఆందోళ‌న నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో వారంతా విషం తాగారు. దీంతో అక్క‌డే ఉన్న ఇత‌ర సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వారిని వెంట‌నే హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. మొత్తం ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. గత కొన్ని నెలలుగా త‌మ‌కు మేనేజ్ మెంట్ జీతాలు ఇవ్వడం లేదని.. అందుకే త‌మ స్నేహితులు తోటి ఉద్యోగులు పేర్కొన్నారు. వారికి ఏడు నెల‌లుగా జీతాలు అంద‌డం లేద‌ని సీనియర్ పోలీసు అధికారి అజయ్ సింగ్ కుష్వాహ తెలిపారు.

పిల్లాడు ఎదురుగా హస్త ప్రయోగం..60ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష..!

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios