Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్‌.. ఒకే నెలలో 23.87లక్షల భారతీయ వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం.. కారణం ఏంటంటే..!

సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సాప్ భార‌తీయ యూజ‌ర్ల‌కు షాకిచ్చింది. జూలై నెల‌లో ఏకంగా 23,87,000 భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. జూన్‌లోనూ 22లక్షకుపైగా భారతీయ ఖాతాలను వాట్సాప్‌ నిషేధించింది. 

WhatsApp Banned 2.4 Million Indian Accounts In July
Author
First Published Sep 2, 2022, 12:50 PM IST

సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సాప్ భారతీయ ఖాతాదారుల‌కు షాక్ ఇచ్చింది. ఒకే నెల‌లో లక్షలాది భారతీయుల‌ వాట్సాప్  ఖాతాలను నిషేధించింది. యాప్ విధానాల‌ను ఉల్లంఘించినా..  తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారి ఖాతాలను బ్యాన్ చేసింది. ఈ క్ర‌మంలో జులైలో 23 లక్షల ఖాతాలను, జూన్‌లో 22 లక్షల ఖాతాలపై వాట్సాప్ నిషేధం విధించింది. వాట్సాప్ ఖాతాలను నిషేధించడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు కూడా ప‌లు మార్లు ఇలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. ఖాతాలను తొల‌గిస్తుంది. గత నెలతో పోలిస్తే.. నిషేధిత ఖాతాల సంఖ్య పెరిగింది. జూన్ నెలలో కంపెనీ 22 లక్షల ఖాతాలను నిషేధించ‌గా.. జూలైలో అది 23 లక్షలపై నిషేధం విధించింది. 
  
కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఐటి రూల్స్ 2021 ప్రకారం.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, సైబర్ భద్రతను ఉల్లంఘించడం, ఇతర కారణాల వల్ల ఈ ఖాతాలు నిషేధించబడ్డాయి. చాలా మంది వినియోగదారులు అసభ్యత లేదా హానికరమైన స‌మాచారాన్ని వ్యాప్తి చేస్తున్నార‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో జూలై నెలలో 574 ఫిర్యాదులు అందాయని తెలిపారు.  జూలై నెలలో కంపెనీ మొత్తం 2,387,000 ఖాతాలను నిషేధించింద‌నీ, జూలై 23,87,000 ఖాతాలపై నిషేధం విధించగా.. ఇందులో 14 లక్షలకుపైగా ఖాతాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిషేధించినట్లు తెలిపారు. అలాగే.. జూన్‌లో 22లక్షకుపైగా భారతీయుల వాట్సాప్ ఖాతాలను బాన్ చేసిన‌ట్టు తెలిపారు.

వాస్తవానికి.. వాట్సాప్..  అటువంటి ఖాతాలను ప్రతి నెల నిషేధిస్తుంది. ఈ జాబితాలో వినియోగదారులు నివేదించిన లేదా యాప్‌ల విధానాన్ని ఉల్లంఘించిన ఖాతాలు ఉన్నాయి. మేలో 19లక్షలు, ఏప్రిల్‌లో 16లక్షలు, మార్చిలో 18.05 లక్షల వాట్సాప్ ఖాతాలపై  చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలిపారు. 

మీరు కూడా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.. 

ఎవరైనా మీతో అనుచితంగా ప్రవర్తించినట్లయితే.. మీరు వారి ఖాతాపై ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. కొన్ని సందర్భాల్లో.. వినియోగదారులు సాక్ష్యంగా స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా.. మీరు వాట్సాప్‌లో వినియోగదారుని సులభంగా బ్లాక్ చేయవచ్చు.

మీరు ప్లాట్‌ఫారమ్‌లో ఒక‌ వినియోగదారుని బ్లాక్ చేసి రిపోర్ట్ చేసినప్పుడు.. WhatsApp మీ చాట్‌లోని చివరి 5 సందేశాలను అడుగుతుంది. మరోవైపు.. మీరు వినియోగదారుని నిరోధించలేదని నివేదించాలనుకుంటే.. వారి పంపిన సందేశంపై నొక్కి ప‌డితే..ఆపై మూడు చుక్కలు వ‌స్తాయి.. అందులో రిపోర్టు అనే ఆప్ష‌న్ ఉంటుంది. అలా కూడా.. ఇత‌ర వ్య‌క్తుల ఖాతాల‌పై ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.  

Follow Us:
Download App:
  • android
  • ios