ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తో తన ఇంట్లోనే సెక్స్ చేశాడు. ఆ విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. తన చెల్లిని మరో వ్యక్తితో అభ్యంతరకర రీతిలో చూడటం ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. చివరికి ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  షేర్పూర్ గ్రామానికి చెందిన సూరజ్ పాల్(24) పక్క గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆదివారం సూరజ్ పాల్ తన గర్ల్ ఫ్రెండ్ ని తన ఇంటికి తీసుకువచ్చాడు.  వారిద్దరూ ఆ సమయంలో సెక్స్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి సోదరుడు గౌతమ్ పాల్ అక్కడికి చేరుకొని వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.

గౌతమ్ ఇంటి తలుపులు పగలకొట్టి చూసేసరికి... తన సోదరి సూరజ్ తో అసభ్యరితీలో కనిపించడం చూసి గౌతమ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే సూరజ్ తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో సూరజ్ తుపాకీతో గౌతమ్ పై కాల్పులు జరిపాడు. బులెట్ గాయం కావడంతో గౌతమ్ ని అతని స్నేహితులు ఆస్పత్రికి తలించారు. ప్రస్తుతం గౌతమ్ లక్నోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాగా... గౌతమ్ ని కాల్చినందుకు... అతని చెల్లితో అసభ్యంగా ప్రవర్తించినందుకు వారి బంధవులు ఆవేశంతో ఊగిపోయారు. సూరజ్ ని పట్టుకొని పదునైన కత్తులు, కర్రలతో అతి దారుణంగా హింసించారు. తీవ్రగాయాలపాలై సూరజ్ కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.