మొన్నటిదాకా సమాజ్ వాదీ పార్టీ రాంపూర్ అభ్యర్థి అజంఖాన్... బీజేపీ అభ్యర్థి జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆయన వంతు అయిపోయింది.. ఆయన కొడుకు వంతు వచ్చింది. తాజాగా అజంఖాన్ కుమారుడు అబ్దుల్లా అజంఖాన్.. జయప్రదపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.

‘‘మాకు అలీ, భజరంగబలీలు కావాలి కానీ, అనార్కలీ వద్దు’’ అంటూ ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజంఖాన్ పాన్ దరేబా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో వ్యాఖ్యలు చేశారు. ఆజంఖాన్ పరోక్షంగా జయప్రదనుద్దేశించి అనార్కలీ వద్దంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే జయప్రదపై అజంఖాన్ వివాదాస్పద కామెంట్స్ చేసి ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. అజంఖాన్..మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తండ్రి బదులు ప్రచారంలో పాల్గొన్న కొడుకు అబ్దుల్లా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత వార్తలు

రాంపూర్‌లో టఫ్ ఫైట్: జయప్రదకు అమర్‌సింగ్ బాసట

జయప్రదపై వ్యాఖ్యలు.. ఏడ్చేసిన ఆజాంఖాన్

జయప్రదపై వ్యాఖ్యల మీద ఆజంఖాన్ స్పందన ఇదీ.. (వీడియో)

జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: ఆజంను వెనకేసుకొచ్చిన అఖిలేష్

నేను చస్తే, సంతోషిస్తావా: ఆజంపై జయప్రద మండిపాటు

జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: మాట మార్చిన ఆజంఖాన్

జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: ఆజంఖాన్‌‌పై కేసు నమోదు

ఖాకీ అండర్ వేర్ వేసుకుంది: జయప్రదపై ఆజం ఖాన్, బిజెపి ఫైర్

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

అభ్యంతకర వ్యాఖ్యలు: ఆజం ఖాన్ కు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి