తనపై ఆజంఖాన్ వాడిన పదజాలాన్ని తాను సహించబోనని జయప్రద అన్నారు. ఈ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో ఆమె ఆజంఖాన్ వ్యాఖ్యలపై మాట్లాడారు. ఆజంఖాన్ కు ఎవరూ ఓటు వేయవద్దని ఆయన ప్రజలను కోరారు. 

రాంపూర్: తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ పై రాంపూర్ బిజెపి అభ్యర్థి జయప్రద తీవ్రంగా మండిపడ్డారు. రాంపూర్ ప్రచారంలో ఆదివారంనాడు ఆజంఖాన్ జయప్రదపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తనపై ఆజంఖాన్ వాడిన పదజాలాన్ని తాను సహించబోనని జయప్రద అన్నారు. ఈ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో ఆమె ఆజంఖాన్ వ్యాఖ్యలపై మాట్లాడారు. ఆజంఖాన్ కు ఎవరూ ఓటు వేయవద్దని ఆయన ప్రజలను కోరారు. 

మీరు నన్ను మీ సోదరిగా భావిస్తే ఆజంఖాన్ కు వ్యతిరేకంగా పోరాడండని ఆమె పిలుపునిచ్చారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై కూడా ఆమె మండిపడ్డారు. ఎస్పీ నుంచి జయప్రద 2010లో బహిష్కరణకు గురయ్యారు. ఇటీవల ఆమె బిజెపిలో చేరి రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. 

జయప్రదపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆజంఖాన్ కు షోకాజ్ నోటీసు పంపిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఆదివారంనాడు చెప్పారు. 

సంబంధిత వార్తలు

ఖాకీ అండర్ వేర్ వేసుకుంది: జయప్రదపై ఆజం ఖాన్, బిజెపి ఫైర్

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి