తన వ్యాఖ్యలపై తీవ్రమైన దుమారం చెలరేగడంపై ఆజంఖాన్ మాట మార్చారు. రాంపూర్ నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, మంత్రిగా పనిచేశానని, ఎలా మాట్లాడాలో తనకు తెలుసునని ఆయన అన్నారు.తాను మగవాళ్లను ఉద్దేశించి మాత్రమే అన్నట్లు తెలిపారు. 

రాంపూర్: రాంపూర్‌ బీజేపీ అభ్యర్థి, సినీనటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రమైన వివాదానికి దారి తీశాయి. దీంతో ఆజంఖాన్ వివరణ ఇచ్చారు. జయప్రదపై తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, ఆమెనుద్దేశించి మాట్లాడినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. .

తన వ్యాఖ్యలపై తీవ్రమైన దుమారం చెలరేగడంపై ఆజంఖాన్ మాట మార్చారు. రాంపూర్ నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, మంత్రిగా పనిచేశానని, ఎలా మాట్లాడాలో తనకు తెలుసునని ఆయన అన్నారు.తాను మగవాళ్లను ఉద్దేశించి మాత్రమే అన్నట్లు తెలిపారు. 

"ఆయన తనతో పాటు 150 తుపాకులు తెచ్చుకున్నాడు. అజాంఖాన్ కనిపిస్తే కాల్చేస్తాడు. ఇప్పుడు ఆయన ఆరెస్సెస్ ప్యాంటు తొడుక్కున్నాడని తేలిపోయింది. షార్టులు పురుషులే వేసుకుంటారు" అని తాను అన్నట్లు తెలిపాడు.

అజాంఖాన్ కూడా ప్రస్తుతం రాంపూర్ నుంచే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బిజెపి అభ్యర్థిగా జయప్రద పోటీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: ఆజంఖాన్‌‌పై కేసు నమోదు

ఖాకీ అండర్ వేర్ వేసుకుంది: జయప్రదపై ఆజం ఖాన్, బిజెపి ఫైర్

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

అభ్యంతకర వ్యాఖ్యలు: ఆజం ఖాన్ కు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి