మురాదాబాద్: రాంపూర్ బిజెపి అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ నేత ఆజం ఖాన్ ను సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ వెనకేసుకొచ్చారు. మీడియాపై ఆయన దుమ్మెత్తిపోశారు. సందర్భం నుంచి విడదీసి ఆజంఖాన్ వ్యాఖ్యలపై మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 

జయప్రదపై ఆజంఖాన్ వ్యాఖ్యలు చేసిన సమయంలో అఖిలేష్ యాదవ్ కూడా పక్కనే ఉన్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను వక్రీకరించారని, ఎవరి గురించో మాట్లాడితే మరొకరిపై వ్యాఖ్యలు చేసినట్లు చిత్రీకరించారని, ఆర్ఎస్ఎస్ దుస్తులపై ఆజంఖాన్ మాట్లాడితే వేరొకరికి ఆ వ్యాఖ్యలను అంటగట్టారని ఆయన అన్నారు. 

ఆజంఖాన్ మాటలను మీడియా వక్రీకరించి మరో రకంగా మాట్లాడినట్లు చూపించిందని అఖిలేష్ యాదవ్ అన్నారు. అఖిలేష్ యాదవ్ వెనకేసుకొచ్చినప్పటికీ ఆజంఖాన్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతూనే ఉంది.

సంబంధిత వార్తలు

నేను చస్తే, సంతోషిస్తావా: ఆజంపై జయప్రద మండిపాటు

జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: మాట మార్చిన ఆజంఖాన్

జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: ఆజంఖాన్‌‌పై కేసు నమోదు

ఖాకీ అండర్ వేర్ వేసుకుంది: జయప్రదపై ఆజం ఖాన్, బిజెపి ఫైర్

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

అభ్యంతకర వ్యాఖ్యలు: ఆజం ఖాన్ కు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి