Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో పెంచుకునే మొక్కలకూ వాస్తు.. తెలుసుకుంటే అన్నీ లాభాలే...

వాస్తు ప్రకారం చాలా మంది ఇళ్లు నిర్మించుకుంటారు, అయితే మొక్కల విషయంలో మాత్రం మంచి ఖాళీ స్దలం ఉంది కదా అని వేసేస్తారు, అయితే ఇక్కడ కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. ముఖ్యంగా మొక్కల విషయంలో ఈ నియమాలు పాటిస్తే వాస్తు దోషాలు, ఇబ్బందులు ఉండవు.

What Kind of Plant-Trees Should Be Planted? as per Vastu Astrology, Dr. MN Charya - bsb
Author
Hyderabad, First Published Nov 12, 2020, 11:47 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

వాస్తు ప్రకారం చాలా మంది ఇళ్లు నిర్మించుకుంటారు, అయితే మొక్కల విషయంలో మాత్రం మంచి ఖాళీ స్దలం ఉంది కదా అని వేసేస్తారు, అయితే ఇక్కడ కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. ముఖ్యంగా మొక్కల విషయంలో ఈ నియమాలు పాటిస్తే వాస్తు దోషాలు, ఇబ్బందులు ఉండవు.

1. ఇంటి సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల ప్రక్కన కాని చెట్లను పెంచకూడదు.

2. ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి.

3. తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో పెంచాలి.    

4. పడమర లేదా దక్షిణ వాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా వుండాలి.

5. ఉత్తర ద్వారం వారి ఇంటికి వాయువ్యంలో తులసికోట వుండాలి.

6. ఇక తులసి కోట మొక్క విషయంలో ఈశాన్యంలో ఉంచకూడదు.

7. ఉత్తర దిశలో కొబ్బరి, మామిడి, దానిమ్మ, బత్తాయ ఈ చెట్లు వేయకూడదు.

8. మీకు ఆనవాయితీ ఉంటే అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోవాలి.

9. ఖచ్చితంగా ఇంటికి నైరుతి దిశలో కొబ్బరి చెట్టు ఉండాలి.

10. బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచకూడదు.

11. తమలపాకుల మొక్కను దక్షిణ దిశలో ఇంట్లో పెంచటం శుభం.

12. దక్షిణంలో, పడమర, నైరుతి, ఆగ్నేయం, వాయవ్యంలో పూల కుండీలు వుంచవచ్చును.

13. పాలు కారే చెట్లు, ముళ్ల చెట్లు, గోరింట, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, ఇంటి ప్రహారీ లోపల వేయకూడదు, ఇంటి బయట పెంచుకోవచ్చు. ఇంటి వాస్తుకి సంబంధం లేకుండా ఉండాలి.

14. తూర్పు దిశలో రావిచెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్విచెట్టును పెంచరాదు.

15. క్రోటన్ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచవచ్చును.

16. తాటి తుమ్మ ఈత పైనాపిల్ ఇలాంటి చెట్లు ఇంట్లో పెంచకూడదు.

Follow Us:
Download App:
  • android
  • ios