ప్రపంచం మొత్తం చుట్టేయాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. ఆ కోరిక కొందరికి కోరికలానే ఉండిపోతోంది. కానీ కొందరు మాత్రం తమ కోరికను కచ్చితంగా తీర్చుకుంటారు. ఇలానే  ఓ జంటకి ప్రపంచాన్ని చుట్టేయాలనే కోరిక ఉంది. ఆ కోరికను చక్కగా తీర్చుకుంటున్నారు. అక్కడి వరకు ఎలాంటి సమస్యలేదు. కానీ వచ్చిన సమస్యంతా.. వాళ్లు నగ్నంగా తిరగడమే.

వాళ్లు ఏ ప్రాంతాన్ని పర్యటించడానికి వెళ్లినా.. వాళ్లు అక్కడ దుస్తులు వేసుకోరు. నగ్నంగా తిరిగితేనే వాళ్లకి తృప్తి అంట. అందుకే.. ఒంటిపై దుస్తులు లేకుండా తిరిగేస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి.

నిక్, లిన్స్ కార్టే అనే ఈ జంటను ఇప్పుండంతా ‘న్యూడ్ కపుల్స్’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే.. వీరు సందర్శించే ఏ ప్రాంతంలోనూ దుస్తులు వేసుకోరు. అలా దుస్తులు లేకుండా పర్యటించడమే కాకుండా.. తాము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చూడండి అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు.

ఈ న్యూడ్ ట్రావెలింగ్ చిత్రాల వల్ల ఆ జంటకు ఇన్‌స్టాగ్రామ్‌లో క్రేజ్ పెరిగింది. ఫాలోవర్లు పెరగడంతో వారికి అదనంగా డబ్బు కూడా అందుతోంది. దీంతో ఎక్కడపడితే అక్కడ బట్టలిప్పేసి ఇదిగో ఇలా ఫొటోలకు పోజులిస్తున్నారు. కొండాకోన, బీచ్‌లు, అడవులు, జలపాతాలు.. ఇలా ఎక్కడా రాజీ పడకుండా దుస్తులిప్పేసి ఫొటోలు తీసుకుంటున్నారు. బ్యాక్ న్యూడ్ పోజులతో పిచ్చెక్కిస్తున్నారు.

కొందరు వీళ్ల ఐడియా ని చూసి క్రేజీ.. అంటూ సపోర్ట్ చేస్తుంటే.. కొందరు మాత్రం ఇదేం పిచ్చి.. ఇలా కూడా చేస్తారా అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈ కపుల్ మాత్రం బాగా ఫేమస్ అయ్యారు.