ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు అనే సమాజపు కట్టుబాట్ల నుండి ఇంకా భారతదేశం పూర్తిగా బయటపడలేదు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా మెల్లి మెల్లిగా అడుగులు పడుతున్నాయి. మహిళలు తాము అన్ని రంగాల్లో మగవారితో సమానం అని ముందుకు దూసుకెళుతున్న ఈ తరుణంలో ఛత్తీస్ గఢ్ అడవుల్లో ఉద్యోగం చేస్తున్న సునైనా పటేల్ కథ యావత్ ప్రపంచానికి మార్గదర్శకం అనడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. 

ఈ మహిళా దినోత్సవం నాడు నక్సల్స్ ను ఏరివేస్తూ అక్కడి శాంతి భద్రతలను కాపాడేందుకు తుపాకీ చేతబట్టి అడవుల్లో గస్తీ కాస్తున్న ఎనిమిది నెలల గర్భవతి సునైనా పటేల్ కథ అందరికీ స్ఫూర్తిదాయకం. 

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో నక్సల్ ప్రభావం అం=ఎక్కువ అన్న విషయం అందరికి తెలిసిన విషయమే. అక్కడ నక్సల్స్ దాడుల్లో ప్రతి సంవత్సరం పోలీసులతోసహా ఎందరో సాధారణ ప్రజలు కూడా ప్రణాలను కోల్పోవడం నిత్యకృత్యమైన విషయం. 

గిరిజనులు అధికంగా ఉండే రాష్ట్రం కావడం, రవాణా సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అంతగా అందుబాటులో లేని రాష్ట్రము, అక్షరాస్యత అత్యల్పం అన్ని వెరసి ఛత్తీస్ గఢ్ ఒక వెనకబడిన రాష్ట్రం అని అందంలో ఎటువంటి సందేహం లేదు. 

అలాంటి రాష్ట్రంలో మహిళా ఉద్యోగం చేయడం, అందునా తుపాకీ చేతబూని ప్రజల ప్రాణాలు రక్షించేందుకు కంకణబద్ధురాలై రాత్రనక, పగలనకా శ్రమిస్తూ అడవులవెంట, నిత్యకృత్యంగా కష్టపడుతుంది సునైనా పటేల్. 

ఆమె ప్రస్తుతం దంతేశ్వరి ఫారెస్ట్ ఫైటర్ గా మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లాలో పనిచేస్తుంది. డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్ గా ఆమె సేవలందిస్తుంది. ఆమె రెండు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ ఉద్యోగంలో చేరినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి. 

8నెలల గర్భంతో ఉంది కూడా ఆమె తన డ్యూటీని నిబద్దతతో నిర్వర్తించడంతోపాటు... ఇంకా ఎటువంటి అదనపు బాధ్యతలిచ్చినా కూడా నిబద్దతతో నిర్వర్తిస్తానని అంటుంది. 

గతంలో కూడా ఆమె ఒకసారి విధి నిర్వహణలో ఉండగా గర్భస్రావమైందని, అయినా ఆమె తన విధి నిర్వహనలోంచి కొన్ని రోజులు సెలవు తీసుకోమన్నప్పటికీ కూడా ఆమె ఏనాడు తీసుకోలేదని దంతెవాడ ఎస్పీ అన్నారు. 

సునైనా పటేల్ ఉద్యోగంలో చేరిననాటి నుండి ఆమె ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా మారిందని, ఆమె చేరిన తరువాత తమ టీంలో మహిళా కమాండోల సంఖ్యా చాలా పెరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేసారు.