వంట చేయడం, కూరగాయలు కట్ చేయడం, బేకింగ్ చేయడం లాంటి వాటి వల్ల చిత్త శుద్ధి పెరుగుతుందట. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మంచి, మానసిక థెరపీలాగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఏ ఇంట్లో అయినా దాదాపు మహిళలు వంట చేస్తూ ఉంటారు. ప్రతిరోజూ ఇలా వంట చేయడానికి చాలా మంది మహిళలు ఇబ్బంది ఫీలౌతూ ఉంటారు. కానీ, వంట చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? మీరు నమ్మకపోయినా ఇదే నిజం. వంట చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందట. జీవితంలో ఒత్తిడి, భరించలేని ఏదైనా బాధ కలిగినప్పుడు కూడా వంట చేయడం వల్ల చాలా ఓదార్పు కలుగుతుంది.తాజాగా జరిగిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. వంట చేయడం, కూరగాయలు కట్ చేయడం, బేకింగ్ చేయడం లాంటి వాటి వల్ల చిత్త శుద్ధి పెరుగుతుందట. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మంచి, మానసిక థెరపీలాగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వంట చేయడం వల్ల కలిగే మానసిక లాభాలు..
ఒత్తిడి తగ్గింపు: కూరగాయలు కోయడం వల్ల ఒత్తిడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సృజనాత్మకత: కొత్త రుచులతో ప్రయోగాలు మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.
నిలకడైన దినచర్య: లైఫ్ స్టైల్ ప్రశాంతంగా సాగుతుంది.
సామాజిక అనుబంధం: మనం వండిన భోజనాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా అనుబంధాలు బలపడతాయి.
ఆరోగ్యకరమైన ఆహారం: ఇంట్లో వండిన భోజనం శరీరానికే కాక, మనస్సుకూ శ్రేయస్కరం.
దుఃఖాన్ని తట్టుకోవడం: వంట మనకు ఒక మద్దతుగా మారుతుంది. తాత్కాలికంగా ఓదార్పు కలిగిస్తుంది.
వంట చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని.. మీరు వండినవన్నీ తినేయకూడదు. ముఖ్యంగా ఎమోషనల్ ఈటింగ్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. చాలా మంది విసుగు, బాధ, కోపం వంటి భావాల ప్రభావంతో ఎక్కువగా తినేస్తూ ఉంటారు. కానీ, అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. దానికి బదులు.. సమతుల్య ఆహారం, పోషక పదార్థాలపై దృష్టి, బుద్ధిపూర్వక తినే అలవాటు అలవరచుకోవడం అవసరం.
వంట ఒక కళ, ఒక ధ్యానం, ఒక మానసిక విశ్రాంతి. వంటగదిలో గడిపే ప్రతి నిమిషం – ఓ జ్ఞాపకాన్ని మేల్కొలపవచ్చు, ఓ క్షణానికి అర్ధం ఇవ్వవచ్చు, మనసుని ఓదార్చవచ్చు. మీ వంట ప్రయాణం... మనశ్శాంతికి మార్గం కావచ్చు.