MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Roti Maker: వెయ్యి రూపాయల లోపే దొరికే ఎలక్ట్రిక్ రోటీ మేకర్లు.. ఇక చపాతీలు చేయడం ఈజీ

Roti Maker: వెయ్యి రూపాయల లోపే దొరికే ఎలక్ట్రిక్ రోటీ మేకర్లు.. ఇక చపాతీలు చేయడం ఈజీ

Roti Maker: గ్యాస్ సిలిండర్ సరిగా దొరకని పరిస్థితి. గంటల తరబడి చపాతీలు, రోటీలు ఇప్పుడు కాల్చలేరు.  ఎప్పుడు గ్యాస్ అయిపోతుందోనని టెన్షన్ వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ రోటీ మేకర్లు కొంటే చపాతీలు, రోటీలు చేసుకోవచ్చు. వీటి ధర కేవలం వెయ్యి రూపాయలలోపే.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 15 2026, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎలక్ట్రిక్ రోటీ మేకర్లు
Image Credit : Pinterest

ఎలక్ట్రిక్ రోటీ మేకర్లు

ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్ కష్టాలు వచ్చాయి. గ్యాస్ అయిపోతే బుక్ చేసినా వస్తుందో రాదా అన్న టెన్షన్ ఎక్కువ మందిలో ఉంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రోటీలు, చపాతీలు తినే వారు ఎక్కువే ఉన్నారు. వాటిని గంటల కొద్దీ కాలిస్తే గ్యాస్ కూడా వేస్టవుతుంది. అందుకే ఒక రోటీ మేకర్ కొనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్కెట్లో, ఆన్‌లైన్‌లో చాలా రకాల ఎలక్ట్రిక్ రోటీ మేకర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు చపాతీ ముద్దను పెడితే చాలు అవే రోటీని ఒత్తి, కాలుస్తాయి. ఇవి మీకు సుమారు వెయ్యి రూపాయలలోపే లభిస్తాయి. వీటి వల్ల చపాతీలు, రోటీలు చేయడం సులువుగా మారిపోతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్టెయిన్‌లెస్ స్టీల్ రోటీ మేకర్
Image Credit : Pinterest

స్టెయిన్‌లెస్ స్టీల్ రోటీ మేకర్

స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ ఉన్న రోటీ మేకర్‌ ఆన్ లైన్లో అందుబాటులో ఉంది. దీన్ని చపాతీలు చేశాక శుభ్రం చేయడం చాలా సులువు. ఇందులో రోటీలు, చపాతీలు ఎంతో వేగంగా తయారవుతాయి. రోటీలే కాకుండా, ఇందులో పాపడ్, పూరీ వంటివి కూడా చేసుకోవచ్చు. ఇవి మీకు స్టెయిన్‌లెస్ స్టీల్ రోటీ మేకర్లు వెయ్యి రూపాయలలోపే దొరుకుతాయి.

Related Articles

Related image1
Jasmine Flowers: శోభనం రోజు నవవధువు మల్లెపూలు పెట్టుకోవడం వెనుక అసలు సీక్రెట్ ఇదే
Related image2
First Kiss: మొదటి ముద్దు ఎవరు ఎవరికి పెట్టారు? ఫస్ట్ కిస్ చరిత్ర ఇదే
35
నాన్ స్టిక్ బేస్ రోటీ మేకర్
Image Credit : gemini AI

నాన్ స్టిక్ బేస్ రోటీ మేకర్

ఇప్పుడు మార్కెట్లో నాన్-స్టిక్ బేస్ ఉన్న రోటీ మేకర్లు కూడా దొరుకుతున్నాయి. ఇవి సుమారు 1000 రూపాయల నుంచి 1200 రూపాయల ధరలో లభిస్తాయి. వీటికి నాన్-స్టిక్ ప్లేట్ ఉంటుంది. దీనికి పిండి అతుక్కోదు. ఈ రోటీ మేకర్లు 900 నుంచి 1000 వాట్ల హీటింగ్, ఇండికేటర్ లైట్ తో వస్తాయి. వీటితో రోటీలు, పరాఠాలు కూడా సులభంగా చేసుకోవచ్చు. ఇవి మెత్తగా వస్తాయి. 

45
రోటీ మేకర్‌లో రోటీ ఎలా చేయాలి?
Image Credit : Chat GPT/Pinterest

రోటీ మేకర్‌లో రోటీ ఎలా చేయాలి?

రోటీ మేకర్‌లో రోటీ చేయడానికి  ముందుగా పిండిని సాధారణంగానే సిద్ధం చేసుకోవాలి. అందులోంచి చిన్న ముద్దను తీసి లడ్డూలా చేత్తోనే చుట్టి రోటీ మేకర్ మధ్యలో పెట్టండి. రోడీ మేకర్ హ్యాండిల్ పట్టుకుని గట్టిగా ఒత్తాలి.  ఎలక్ట్రిక్ రోటీ మేకర్‌లో రోటీని రెండు వైపులా తిప్పుతూ కాల్చాలి. కొద్దిగా నొక్కితే చాలు, రోటీ చక్కగా పొంగుతుంది.

55
ప్రెస్టీజ్ రోటీ మేకర్
Image Credit : Chat GPT

ప్రెస్టీజ్ రోటీ మేకర్

ప్రెస్టీజ్ బ్రాండ్ రోటీ మేకర్ చక్కగా పనిచేస్తుంది. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలో 50 నుంచి 60 శాతం డిస్కౌంట్‌తో ఈ రోటీ మేకర్లు వస్తాయి. దీంతో ప్రెస్టీజ్ రోటీ మేకర్ కేవలం వెయ్యిరూపాయలలోపే వస్తుంది. కాల్చకుండా కేవలం రోటీలను ఒత్తే రోటీ మేకర్లు కూడా ఉన్నాయి. ఇవి రూ.500 నుంచే మొదలవుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice vs Chapati vs Jowar Roti: అన్నం, చపాతీ, జొన్న రొట్టె.. వీటిలో రాత్రి భోజనానికి ఏది బెస్ట్?
Recommended image2
AD necklace:రూ.వెయ్యికే డైమండ్ లా మెరిసే ఏడీ స్టోన్ నక్లెస్ డిజైన్లు
Recommended image3
Cooking Tips: తక్కువ నూనెతో.. రుచిగా వంట చేయాలా? ఈ చిన్న చిట్కా ఫాలో అయితే చాలు..!
Related Stories
Recommended image1
Jasmine Flowers: శోభనం రోజు నవవధువు మల్లెపూలు పెట్టుకోవడం వెనుక అసలు సీక్రెట్ ఇదే
Recommended image2
First Kiss: మొదటి ముద్దు ఎవరు ఎవరికి పెట్టారు? ఫస్ట్ కిస్ చరిత్ర ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved