మొన్నటి వరకు పెళ్లిళ్ల సీజన్ నడిచింది. ఒకే ఒక్క రోజు వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. కాగా నేటి నుంచి  మంచి ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. మూఢమి ప్రవేశంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు దాదాపు మూడు నెలలపాటు ఆగుతాయన్నారు. 

ఏటా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో చక్కటి ముహూర్తాలు ఉండేవని, జూలై ఆషాఢ మాసం కావడంతో శూన్యమాసం అయ్యిందని, కారణంగా శుభకార్యాలు జరగబోవని తెలిపారు. 

ఈ ఏడాది శ్రావణ మాసంలో కూడా మూఢమి వచ్చింది. సెప్టెంబర్‌ భాద్రపద మాసం కావడంతో శూన్యమాసమయ్యింది. మూడు నెలలు శుభకార్యాలకు ఆటంకం ఏర్పడింది. అక్టోబర్‌ 2 నుంచి ముహూర్తాలు మొదలవుతాయి.